అంకుర్ గ్రామంలో కంటి వెలుగు, పలు అభివృద్ధి పనులను పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్భాన్

పత్రికా ప్రకటన     తేది:24.01.2023, వనపర్తి.
    కంటి వెలుగు కార్యక్రమాన్ని బాధ్యతగా తీసుకొని 100 శాతం కంటి పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఆశిష్ సంగ్భాన్ ఆదేశించారు.
     మంగళవారం అంకురు గ్రామపంచాయతీలోని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు పూర్తయిన ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలు నిర్వహించి, సమస్యలను గుర్తించి ఆన్లైన్లో నమోదు చేయాలని, అవసరమైన వారికి కంటి అద్దాలను అందించాలని, సమస్య వున్న వారికి మందులను అందజేయాలని ఆయన సూచించారు. వైద్య అధికారులు, ప్రజా ప్రతినిధులు బాధ్యతగా తీసుకొని, గ్రామాలలో ఆశా కార్యకర్తలు, అంగన్వాడి టీచర్ల, పంచాయతీ సెక్రటరీలు, ఏఎన్ఎంలు ద్వారా ప్రజలలో అవగాహన కల్పించాలని, టామ్ టామ్ వేయించాలని, మైక్ ద్వారా అవగాహన కల్పించాలని ఆయన తెలిపారు. 100 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
     అంకూర్ గ్రామపంచాయతీలోని తెలంగాణకు క్రీడా ప్రాంగణాలు, నర్సరీలను, బృహత్ పల్లె ప్రకృతి వనాలను, అవెన్యూ ప్లాంటేషన్, సెగ్రికేషన్ షెడ్, తదితర పనులను తనిఖీ చేసి, ఉపాధి హామీ కూలీల సంఖ్య, హాజరు నమోదు, పనుల వివరాలను ఆయన పరిశీలించారు. అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. లక్ష్యానికి అనుగుణంగా పనులను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులకు ఆయన ఆదేశించారు.
      జిల్లా అదనపు కలెక్టర్ వెంట ఆర్డిఓ పద్మావతి, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
…….
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post