అంకూర్, ముందరి తండా, బలిజపల్లి గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్ తనిఖీ : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన. తేది:23.09.2021.
వనపర్తి.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సెప్టెంబర్ 16 నుండి స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్ కొనసాగుతున్నదని, ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులను ఆదేశించారు.
గురువారం అంకూర్, ముందరి తండా, బలిజపల్లి గ్రామ పంచాయతీలలో వ్యాక్సినేషన్ సెంటర్ లను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.
అంకూర్ గ్రామంలో రైతు వేదికను, బలిజపల్లి గ్రామపంచాయతీ వ్యాక్సినేషన్ సెంటర్, ముందరి తండా అంగన్వాడి సెంటర్ ను, పెద్దమందడి పరిధిలోని ప్రాథమిక పాఠశాల, పామిరెడ్డిపల్లి సబ్ సెంటర్ ను ఆమె పరిశీలించారు.
ముందరి తండా గ్రామపంచాయతీలో 18 సంవత్సరాలు పైబడిన వారందరూ వ్యాక్సిన్ చేయించుకున్నారని, 100% వ్యాక్సినేషన్ పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా ముందరి తండా ఏఎన్ఎం, పంచాయతీ సెక్రెటరీ, సర్పంచ్ లను జిల్లా కలెక్టర్ అభినందించారు.
కలెక్టర్ వెంట జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ చందు నాయక్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
…………
జిల్లా పౌర సంబంధాల అధికారి, ద్వారా జారీ చేయబడినది.

Share This Post