అంగన్వాడి కేంద్రం పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి తేజ్ వి పాటిల్

దోమకొండ మండల కేంద్రంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ జితేష్ వి పాటిల్ అంగన్వాడి కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో ఉన్న పిల్లల సంఖ్యను అడిగి తెలుసుకున్నారు. ఎత్తుకు తగినట్లు బరువు, వయస్సు తగ్గినట్లు ఎత్తు పిల్లలు ఉండే విధంగా చూడాలని ఐసిడిఎస్ అధికారులకు సూచించారు. పిల్లల బరువును తూకం చేశారు. అంగన్వాడీ కేంద్రంలో బలహీనమైన పిల్లలు ఉంటే అదనంగా పౌష్టికాహారం అందించాలని పేర్కొన్నారు. రికార్డులు పరిశీలించారు. గర్భిణీలకు పౌష్టికాహారం అందే విధంగా చూడాలని కోరారు. ప్రసవాలు ప్రభుత్వాసుపత్రిలో చేయించుకోవాలని గర్భిణీలకు సూచించారు. కార్యక్రమంలో జిల్లా శిశు, మహిళ, దివ్యాంగుల, వయో వృద్ధుల సంక్షేమ అధికారిని సరస్వతి, సిడిపిఓ రోచిష్మా, అంగన్వాడీ కార్యకర్త భాగ్యలక్ష్మి పాల్గొన్నారు. —————– జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం కామారెడ్డి చే జారీ చేయనైనది.

Share This Post