అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సరైన పౌష్టికాహారం ప్రతిరోజు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు.

 

అంగన్వాడి కేంద్రాలలో పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు సరైన పౌష్టికాహారం ప్రతిరోజు అందించాలని జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అంగన్వాడీ టీచర్లకు ఆదేశించారు.

గురువారం ఐజ మండలంలోని భూంపురం, తొత్తినోని దొడ్డి, మేడికొండ, చిన్న తాండ్రపాడు, ఐజ గ్రామాలను సందర్శించి అంగన్వాడి కేంద్రాలు, ప్రాథమిక ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ తనిఖీ  పలు సూచనలు చేశారు. మేడికొండ గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాలు ఒకటి, రెండు లలో పాలు గుడ్లు ఇస్తున్నారా లేదా అడిగి తెలుసుకున్నారు. పౌష్టికాహారం అందజేసి వాటిని మొబైల్లో అప్లోడ్ చేయాలన్నారు. గర్భవతులకు పాలు పండ్లు ఇవ్వాలన్నారు. ప్రతిరోజు  పౌష్టికాహారం వివరాలను రిజిస్టర్ లో  నమోదు చేయాలన్నారు. మేడికొండ, సిటీ పాడు గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలను  ,  అంగన్వాడి కేంద్రాలను సందర్శించారు. పాఠశాలలో మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందజేయాలన్నారు. జడ్పీ హైస్కూల్ సందర్శించి విద్యార్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. పాఠశాలను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని మొక్కలు నాటాలని ఆదేశించారు. గ్రామంలో నిర్మిస్తున్న సబ్ సెంటర్ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించి బేస్మెంట్ లెవెల్ పనులు చేయడం వల్ల జిల్లా కలెక్టర్ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు వేగవంతం చేయాలని అధికారులకు  ఆదేశించారు. ఐజ కస్తూరిబా బాలికల  విద్యాలయం ను  సందర్శించి అక్కడి వసతుల గురించి టిచర్లను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలకు సెక్యురిటి, ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేయాలనీ కోరగ మున్సిపల్ కమీషనర్ కు ఆదేశించారు.

అనంతరం ఐజ ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో  నిర్మిస్తున్న  30 పడకల ఆసుపత్రి నిర్మాణ పనులను  పరిశీలించారు. ఇసుక కొరత ఉందని దానివల్ల పనులు ఆలస్యం అవుతున్నాయని ఆస్పత్రి నిర్వహకులు కలెక్టర్కు వివరించారు. ఇసుక కొరత లేకుండా చూస్తామని లేబర్ ను ఎక్కువగా తీసు కొని పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. మున్సిపల్ కార్యాలయంలో చైర్మన్ దేవన్న కమిషనర్లతో రివ్యూ సమావేశం  నిర్వహించారు

ఐజ పట్టణంలోని పెండింగ్ పనులను  పూర్తి చేయాలని ఆదేశించారు. సిసి రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం పూర్తి చేయాలని ,డివైడర్ పనులు త్వరిత గతిన పూర్తి చేయాలనీ అధికారులకు ఆదేశించారు.

కార్య క్రమం లో ఎం పి డి ఓ సాయి ప్రకాష్, మున్సిపల్ చైర్ మెన్ చిన్న దేవన్న, మున్సిపల్ కమీషనర్  నర్సయ్య, డి ఇ ఆంజనేయులు ,  ఏ ఇ గోపాల్ , ఉపాద్యాయులు, అంగన్వాడి టీచర్లు సంబందిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

 

 

—————————————————————————

జిల్లా పౌరసంబంధాల అధికారి, జోగులాంబ గద్వాల్ గారి చే  జారీ చేయబడినది

 

 

 

Share This Post