అంగన్వాడి టీచర్లు, ఆయాలకు నేత చీరలు….

దేశంలో అంగన్వాడిలకు అత్యధిక వేతనాలు ఇస్తుంది తెలంగాణ రాష్ట్రంలోనే

కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ గా అంగన్వాడిలకు 50 లక్షల బీమా వర్తింపు కూడా మన ప్రభుత్వ కృషి ఫలితమే

రాష్ట్రంలో 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలకు నేత చీరలు అందిస్తున్న ఘనత ఈ ప్రభుత్వానిదే

అంగన్వాడిల సేవలు గుర్తించి సీఎం కేసిఆర్ గారు మూడుసార్లు వేతనం పెంచారు

మహబూబాబాద్ లో అంగన్వాడిలకు చీరలు పంపిణీ చేసిన రాష్ట్ర మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్

(మహబూబాబాద్, డిసెంబర్ 21)

దేశంలో ఎక్కడా లేని విధంగా అంగన్వాడిలకు గత ఏడేళ్లలో మూడు సార్లు వేతనాలు పెంచి, అత్యధిక వేతనాలు ఇస్తున్న రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ అన్నారు. అంగన్వాడి టీచర్లకు ఇచ్చే వేతనాల్లో రాష్ట్ర ప్రభుత్వం 75 శాతం తన వాటాగా ఇస్తుంటే..కేంద్రం పావులా వంతు మాత్రమే ఇస్తుందన్నారు. అంతే కాకుండా కోవిడ్ సమయంలో తమ కుటుంబాలను కూడా పట్టించుకోకుండా అద్భుత సేవలు అందించినందుకు వారిని కోవిడ్ వారియర్స్ గా గుర్తించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శనంలో కేంద్రాన్ని స్వయంగా తాను కోరడం వల్లే నేడు దేశ వ్యాప్తంగా అంగన్వాడీలకు 50 లక్షల రూపాయల బీమా వర్తించింది అని చెప్పారు. అదే విధంగా దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే అంగన్వాడీలకు నేత చీరలు అందిస్తున్నాం అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో నేడు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అంగన్వాడీలకు స్థానిక ఎమ్మెల్యే శంకర్ నాయక్ తో కలిసి మంత్రి నేత చీరలు పంపిణీ చేశారు.

సమావేశంలో మంత్రి శ్రీమతి సత్యవతి రాథోడ్ గారి మాటలు….

ఈరోజు సుదినం. మా అంగన్వాడి సిబ్బందికి నేత చీరలు ఇచ్చే మంచి కార్యక్రమం ఇది.

రాష్ట్ర వ్యాప్తంగా 35,700 అంగన్వాడీ కేంద్రాల్లోని 67,411 మంది అంగన్వాడి టీచర్లు, ఆయాలుకు చీరలు ఇస్తున్నం.

ఒక చీరకు 800 రూపాయలు ఖర్చుపెట్టి నేను స్వయంగా టెక్స్ టైల్ మంత్రి గారు అన్న రామన్న దగ్గర కూర్చొని దగ్గర ఉండి చీరల డిజైన్ ఎంపిక చేసి వీటిని రూపొందించాం.

గతంలో అంగన్వాడి టీచర్లు అంటే గర్భవతుల ప్రసవ తేదీలు నమోదు చేసుకునేవారు కాగా సీఎం కెసీఆర్ గారు వచ్చాక ఆరోగ్య లక్ష్మి కింద అన్నం వండి వేడివేడిగా పెట్టడం, గుడ్లు, పాలు ఇవ్వడం జరుగుతుంది.

అంగన్వాడీల ఈ అదనపు కృషిని గుర్తించిన సీఎం కేసిఆర్ గారు దేశంలో ఎక్కడా లేని విధంగా వారికి మంచి గౌరవం వేతనం ఇస్తున్నారు.

గిరిజన ప్రాంతాల్లో గిరిజన బిడ్డలకు పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు బలామృతంతో కూడిన పోషకాహార భోజనాన్ని అందిస్తున్నాం.

దేశంలో అంగన్వాడీలకు ఎక్కువ వేతనం ఇస్తుంది తెలంగాణ రాష్ట్రమే. ఇందులో కేంద్ర ప్రభుత్వ వాటా పావులా ఉంటే..మనది 75 శాతం ఉంది.

అంగన్వాడీల జీతాలు పెంచినప్పుడి కేంద్రం వారి వాటా పెంచకున్నా… సీఎం కేసిఆర్ గారు మొత్తం వాటా పెంచి..30 శాతం PRC ఇచ్చారు.

మన రాష్ట్రంలో అంగన్వాడీ టీచర్లకు 13650 రూపాయల వేతనం ఇస్తున్నాం. ఇందులో 2500 రూపాయలు మాత్రమే కేంద్రం ఇస్తుంది.

ఈ ఏడేళ్ళలో రాష్ట్ర ప్రభుత్వం 3 సార్లు వేతనం పెంచితే కేంద్రం ఒక్కసారి కూడా వేతనం పెంచకపొవడం దారుణం.

దేశవ్యాప్తంగా ఫ్రంట్ లైన్ వారియర్స్ కు ఇచ్చినట్టు అంగన్వాడిలకు కూడా ఇవ్వాలని నేను స్వయంగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గారిని కలిసి అడిగాను. దీనివల్ల మనని కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా గుర్తించి 50 లక్షల బీమా కల్పించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ముందు చూపు వల్లే ఇది సాధ్యం అయింది.

పిల్లలు వారి వయసుకు తగిన బరువు, ఎత్తు నమోదు చేయడానికి స్మార్ట్ ఫోన్ ఇవ్వాలని నిర్ణయించి వారికి అందించాం.

చేయని తప్పుకి అంగవైకల్యం వచ్చి ఇబ్బంది పడితే ..వారి వివరాలు అంగన్వాడీ సిబ్బందే నమోదు చేయించి వారికి మూడు చక్రాల వాహనాలు ఇప్పించే పని చేస్తున్నాం.

Kovid బారిన పడడం వల్ల ఎవరైనా అనాథలు అయితే ఈ ప్రభుత్వమే వారికి అన్ని తానై వారి బాధ్యతలు తీసుకుంటుంది. దీనికి సంబంధించి సమగ్ర నిబంధనలు వస్తాయి.

కొత్త అంగన్వాడిల ఎంపిక కోసం , రిటైర్మెంట్ కోసం గతంలో ఎలాంటి పాలసీ లేకపోతే..ఆ.పాలసీ మేము తెచ్చాం. అంగన్వాడీలను 61 ఏళ్లకు రిటైర్ చేసి గౌరవ ఇన్సెంటివ్ ఇవ్వబోతున్నాం. దీనివల్ల వచ్చే ఖాళీలలో భర్తీకి త్వరలో guide lines వస్తాయి. దాని ప్రకారం నియామకం ఉంటుంది.

ప్రభుత్వం ఇచ్చే వాటిని ప్రజలకు సరిగా చేరవేసే మంచి మనసుతో పని చేయాలని కోరుతున్నాను.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, అధికారులు సీతా మహాలక్ష్మీ డెబోరా, ఉష, ఇతర అధికారులు నేతలు పాల్గొన్నారు.
——————————————————————————————

Share This Post