అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలకు చార్జింగ్ లైట్లు, సోలార్ లాంతర్లను పంపిణీ చేస్తున్న జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమం సమర్ధవంతంగా అమలు

అంగన్వాడీ, ఆశాలకు సోలార్ లాంతర్ల పంపిణి

252 అంగన్వాడి కేంద్రాలకు చార్జింగ్ లైట్లు

300 ఆశా కార్యకర్తలకు సోలార్ లాంతర్లు పంపిణీ

00000

జిల్లాలో అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా చేస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ గరిమ అగర్వాల్ అన్నారు.

సోమవారం అదనపు కలెక్టర్ చాంబర్లో అంగన్వాడి టీచర్లకు చార్జింగ్ లైట్ లను, ఆశ కార్యకర్తలకు సోలార్ లాంతర్లను ఆమె పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అంగన్వాడి టీచర్లు, ఆశా కార్యకర్తలు కలసి చేస్తున్నారని వారిని ప్రోత్సహించేందుకు జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని చార్జింగ్ లైట్ లను ,సోలార్ లాంతర్లను మంజూరు చేశారని అన్నారు. కరీంనగర్ జిల్లాలోని 252 అంగన్వాడీ కేంద్రాలకు చార్జింగ్ లైట్ లను, 300 మంది ఆశా కార్యకర్తలకు సోలార్ లాంతర్లను అదనపు కలెక్టర్ పంపిణీ చేశారు.

చార్జింగ్ లైట్ లను, సోలార్ లాంతర్ల ఏర్పాటుకు అవసరమైన సహాయాన్ని పంచాయతీ కార్యదర్శులు చేయాలని ఆమె కోరారు.

Share This Post