అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టరు శ్రీ జితేష్ వి పాటిల్

మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ద్వారా ఇటీవల జిల్లాలోని అంగన్వాడీ కార్యకర్తలకు, సూపర్ వైజర్లకు సరఫరా చేసిన స్మార్ట్ ఫోన్లను జిల్లా కలెక్టరు శ్రీ జితేష్ వి పాటిల్ గారు కామారెడ్డి ప్రాజెక్ట్ అంగన్వాడీ టీచర్లకు ఈరోజు అందజేసారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు గారు మాట్లాడుతూ జిల్లాలోని అంగన్వాడీ టీచర్లు, సూపర్ వైజర్లకు శాఖ ద్వారా స్మార్ట్ ఫోన్లు అందించడం హర్షణీయమని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా లబ్దిదారులకు అందించే సేవల సమాచార సేకరణలో మరియు ఫలితాలను పర్యవేక్షించడంలో ఈ స్మార్ట్ ఫోన్ల లోని ఆప్లికేషన్స్ ఉపయోగపడతాయని దీని ద్వారా మెరుగైన పోషణ ఆరోగ్య సేవలను లబ్దిదారులకు అందించాలని అంగన్వాడీ టీచర్లకు సూచించారు. టీచర్లకు స్మార్ట్ ఫోన్లు వినియోగించడంలో శిక్షణ ఇవ్వాలని జిల్లా సంక్షేమాధికారికి సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, సీడీపీఓ శ్రీలత, సూపర్ వైజర్ అమృత, జూనియర్ అసిస్టెంట్ సాగర్, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Share This Post