అంగన్వాడీ కేంద్రంలో రంగు రంగుల బొమ్మలతో అంగరంగ వైభవంగా తీర్చిదిద్ది చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని తయారు చేశారని జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు.

సోమవారం పాల్వంచ మండలం గుడిపాడు. అంగన్వాడీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన కేంద్రంలో ఏర్పాటు చేసిన న్యూట్రి కిచెన్ గార్డెనన్ను పరిశీలించారు. న్యూట్రీ గార్డెన్లో అంగన్వాడీ టీచర్, ఆయా కూర మంచిగా కూరగాయలు పండిస్తున్నారని, కిచెన్ గార్డెన్ చాలా బాగా చేశారని సిబ్బందిని అభినందించారు. కిచెన్ గార్డెన్లో పండిన తాజా కూరగాయలు వినియోగం వల్ల చిన్నారులు పోషణ లోపాన్ని అధిగమిస్తారని, చెప్పారు. ఇదే స్ఫూర్తితో అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రీ గార్డెన్లు ఏర్పాటు చేయు విధంగా చర్యలు: తీసుకుంటామని చెప్పారు. అంగన్వాడీ కేంద్రంలో మరుగుదొడ్డి, మంచినీరు సౌకర్యంతో పాటు ప్రహరిగోడను నిర్మించాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. మహారాష్ట్రతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ఎంతో శ్రమించి రంగు రంగుల బొమ్మలు వేశారని అభినందించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రాన్ని ఇదే విధంగా సుందరంగా అంగరంగ వైభవంగా రంగు రంగుల బొమ్మలతో తీర్చిద్దినున్నట్లు ఆయన వివరించారు. చిన్నారులతో రైమ్స్ పాడించుకుని వెరీ గుడ్ బాగా చెప్పారని ఎత్తుకుని అభినందించారు. చిన్నారులతో కలిసి ఫోటోలను దిగి ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం ఈ విధంగా తయారు కావాలని, అపుడే పోషణలోపం లేని భావిభారతాన్ని నిర్మించగలమని అపుడే మన జిల్లా పోషణలోపం లేని జిల్లాగా తయారవుతుందని చెప్పారు. చిన్నారులకు అందించే మెనూను సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. చిన్నారులు బరువొక్కటే కాదని, ఆకుకూరలు, గుడ్లు పెట్టాలని చెప్పారు. ముఖ్యమంత్రి ఆలోచన మేరకు అంగన్వాడీ కేంద్రాల్లో పోషణలోపాన్ని అధిగమించేందుకు చేపట్టిన చర్యలను ఈ నెల 22వ తేదీ ప్రధానమంత్రి నరేంద్రమోడ్ ఆకాంక్షిత జిల్లాల కలెక్టర్లుతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో అభినందించారని చెప్పారు. పోషణలోపాన్ని అధిగమించేందుకు ప్రతి బుధవారం చిన్నారుల తల్లులు, సర్పంచులతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి వరలక్ష్మి, సిడిపిఓ కనకదుర్గ, మున్సిపల్ కమిషనర్ శ్రీకాంత్, సూపర్వైజర్ హసీనాబేగం, అంగన్వాడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post