అంగన్వాడీ కేంద్రాన్ని ఆకస్మికంగా

ప్రచురణార్థం —1
పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలి:: జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ
• మల్లెరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టుదిట్టంగా పారిశుద్ద్య చర్యలు చేపట్టాలి
• పిల్లలకు మరియు బాలింతలకు పౌష్టికాహారం అందించాలి
• పెద్దపల్లిలో13వ వార్డులో అంగన్ వాడి కేంద్రాన్ని ఆకస్మీకంగా పరిశీలించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి , సెప్టెంబర్ 04 :
-. అంగన్ వాడి కేంద్ర పరిసరాలలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పారిశుద్ద్య నిర్వహణ పై ప్రత్యేక శ్రద్ద వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులకు సూచించారు. శనివారం పెద్దపల్లిలోని 13వ వార్డు జ్యోతినగర్ లో అంగన్ వాడి కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. అంగన్ వాడి కేంద్రంలో ఉన్న పిల్లలు, బాలింతలతో కలెక్టర్ ముచ్చటించారు. అంగన్ వాడి కేంద్రంలో అందిస్తున్న పౌష్టికాహారం, తదితర అంశాల గురించి వివరాలు తెలుసుకున్నారు. అంగన్ వాడి కేంద్రంలో నిర్వహిస్తున్న అటెండెన్స్ రిజీస్టర్, స్టాక్ రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించారు. అంగన్ వాడి కేంద్ర పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాల నేపథ్యంలో మల్లెరియా, డెంగ్యూ వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని, నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్  తిరుపతి,  సంబంధిత అధికారులు తదితరులు ఈ  కార్యక్రమంలో  పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి,పెద్దపల్లిచే జారీచేయనైనది.

Share This Post