అంగన్వాడీ కేంద్రాలలో ఒక్కరు కూడా పోషణ లోపంతో బాధపడకుండా చూడాలి..జిల్లా అదనపు కలెక్టర్ చంద్రయ్య.

ఈరోజు జిల్లా మహిళా శిశు దివ్యాంగుల మరియు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో డిపార్ట్మెంటల్ రివ్యూ సమావేశం స్థానిక DPRC భవనములో నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా
జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య పాల్గొని మాట్లాడుతూ, కోవిడ్ -19 కాలంలో అంగన్వాడీ టీచర్ చేసిన కృషి చాలా అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా అంగన్వాడి కేంద్రంలో గ్రోత్ మానిటరింగ్ డ్రైవ్ పక్కాగా అమలు చేసి ఎవరు కూడా పోషణ లోపంతో బాధ కూడా చూడాలని ప్రతి అంగన్వాడి కేంద్రం నుండి మోడరేట్ ,సేవర్ పిల్లలను గుర్తించి అట్టి పిల్లలను మోడరేట్ నుండి నార్మల్ పిల్లలుగా, అదేవిధంగా సేవర్ ఉన్న పిల్లలను మోడరేట్ వచ్చే విధంగా చూడాలని చెప్పారు.ఎవరైతే అతి తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారి పైన ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని నార్మల్ పిల్లలుగా తయారై విధంగా చూడాలని అన్నారు.ఎవరైతే అతి తీవ్ర కోసం లోపం ఉన్న పిల్లల కోసం తాండూర్ డిస్టిక్ హాస్పిటల్ లో NRC సెంటర్ కు రిఫర్ చేయాలని అందుకోసం యన్ఆర్ సి సెంటర్ లో ఇద్దరు డాక్టర్లు నియమించడం జరిగిందని, కావున వారి సేవలను వినియోగించుకోవాలని తెలిపారు. ఎవరైన తీవ్ర పోషణ లోపం ఉన్న పిల్లలను, హాస్పటల్ కు తీసుకెళ్లడానికి 102 వాహనాన్ని వినియోగించుకోవచ్చన్నారు.
ప్రతి అంగన్వాడి కేంద్రం పరిధిలోని పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని,అంగన్వాడి కేంద్రం చుట్టూ తాత్కాలికంగా ఇనుప కంచెను ఏర్పాటు చేసేటట్లు డి పి ఓ గారి సహకారం తీసుకోవాలని సూచించారు.
మన జిల్లాలో ఏ ఒక పిల్లవాడు కూడా
పోషక లోపంతో బాధపడకుండా, చూడాలని తెలిపారు.ఎక్కడైతే పాక్షికంగా దెబ్బతిన్న అంగన్వాడీ కేంద్రాలకు మరమ్మతు కోసం జడ్పీ సీఈఓ గారి దృష్టికి తీసుకోవేళ్ళాలన్నారు.అదేవిధంగా ప్రతి అంగన్వాడీ టీచర్, హెల్పర్, స్వయం సంఘాల గ్రూప్ సభ్యులు, ఉపాధి సిబ్బంది, ప్రతి ఒక్కరు కూడా E- Shram Portal,లో రిజిస్టర్ చేసుకునే విధంగా చూడాలన్నారు.
ఈ సందర్బంగా DWO లలితాకుమారి మాట్లాడుతూ, జిల్లాలో 1106 అంగన్వాడీ సెంటర్ లు నిర్వహించడం జరుగుతుందని, ఇందులో 67,342 మంది పిల్లలు, 5601 మంది బాలింతలకు సేవలు అందించడం జరుతుందన్నారు. పోషణ లోపం ఉన్న పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ వహించి డబల్ న్యూట్రీషియన్ అందించడం జరుగుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమానికి జడ్పీ సీఈవో, జానకిరెడ్డి, డి పి ఓ మల్లారెడ్డి,వైద్య అధికారి డాక్టర్ అరవింద్, సీడీపీఓలు,సూపర్వైజర్లు, అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post