అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ ::::::::. అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

జిల్లాలోపౌష్టిక ఆహారం అందించుటలో అంగన్వాడీ కేంద్రాలు  ముందుండాలని అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ అన్నారు. నేరేడు చర్ల లో పలు అంగన్వాడీ కేంద్రాలను శుక్రవారంనాడు  అడిషనల్ కలెక్టర్   ఆకస్మిక తనిఖీ నిర్వహించి పలు రికార్డులను, అంగన్వాడీ కేంద్రాల పనితీరును పరిశీలించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా  అడిషనల్ కలెక్టర్  మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలలో నిర్వహిస్తున్న పూర్వ ప్రాథమిక విద్య పై టీచర్లు పూర్తి స్థాయిలో అవగహన పెంచుకొని కాలానుగుణంగా పిల్లల్లో విద్య  పై మక్కువ పెంచే విదంగా కృషి చేస్తూ,గర్భిణులు బాలింతలకు నాణ్యమైన పౌష్టికాహారం అందజేయాలని క్రమం తప్పకుండా లబ్ధిదారులు టీకాలు తీసుకునే విదంగా చొరవ తీసుకొని వారి ఆరోగ్యవంతమైన జీవితానికి అండగా నిలవాలని కోరారు. అదే విదంగా ప్రతి నెల తల్లిపిల్లల ఎత్తులు, బరువులు చూస్తూ తపోషణలోపం తో బాధే పడే వారిని గుర్తించి అదనపు పోషకాహారం అందజేయాలని ,న్యూట్రిషన్ రిహాబీటషన్ సెంటర్ కు కూడా సిఫార్సు చేసి జిల్లాలో పోషణ లోపం లేకుండా నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రాలలో రిజిస్టర్లను, బరువు తుకే పరికరాలను ,పౌష్టికాహార నాణ్యతను పరిశీలించారు. ఈ పర్యటనలో జిల్లా సంక్షేమ అధికారిణి జ్యోతిపద్మ పోషన్ అభియాన్ జిల్లా సమన్వయకర్త పి. సంపత్, సీడీపీవో విజయలక్మి, సూపర్ వైజర్ నాగరాణి, పోషన్ అభియాన్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ యనాల రాజేష్ అంగన్వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.

అంగన్వాడీ కేంద్రాల ఆకస్మిక తనిఖీ.
అదనపు కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్.

Share This Post