*అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

*అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలి :: జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి*

ముస్తాబాద్, నవంబర్ 11: అంగన్వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు పౌష్ఠికాహారం అందించాలని, కేంద్రాల్లో అన్ని రకాల సౌకర్యాలను కల్పించాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టర్ ముస్తాబాద్ మండలం గూడెం గ్రామంలోని 3 అంగన్వాడీ కేంద్రాలను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేసి, చిన్నారులకు కల్పిస్తున్న వసతులు, అందిస్తున్న సౌకర్యాల తీరును పరిశీలించారు. కేంద్రంలో ఎంత మంది పిల్లలు ఉన్నది, ఎంతమంది హాజరు అవుతున్నది పరిశీలించారు. కేంద్ర పరిధిలో ఎంత మంది గర్భిణులు, బాలింతలు ఉన్నది అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు, బాలింతలకు, గర్భిణీలకు అందిస్తున్న పోషకాహారాన్ని ఆయన పరిశీలించారు. మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలన్నారు. తక్కువ బరువు, పోషణలోపం కలిగివున్న చిన్నారులకు పౌష్ఠికాహారం అందజేస్తూ వారి ఎదుగుదలపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు. కేంద్రాల్లో ఆటవస్తువులు, డ్రెస్ మెటీరియల్, అందమైన డిజైన్లతో కూడిన రంగులు వేయించాలని జిల్లా సంక్షేమ శాఖ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. అలాగే మౌళిక వసతుల కల్పన కోసం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ విభాగం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఈ తనిఖీలో కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ శాఖ అధికారి లక్ష్మీరాజం, తదితరులు ఉన్నారు.

Share This Post