అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా జరగాలి…

ప్రచురణార్థం

అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా జరగాలి…

మహబూబాబాద్ సెప్టెంబర్ 9.

అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

పట్టణంలోని మున్సిపల్ పరిధిలో శనగ పురం తండా రెడ్యా తండా ల అంగన్వాడి కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించి పిల్లల ఆరోగ్యం పై ఎత్తు బరువు లను కొలిపించి సంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా మహబూబాబాద్ సిడిపిఓ డేబోరా కలెక్టర్కు వివరిస్తూ మహబూబాబాద్ ప్రాజెక్టులో 379 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నట్లు వివరించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని పిల్లల సంఖ్య పెంచాలని, అందుకు కావలసిన త్రాగు నీరు విద్యుత్తు వంటి సౌకర్యాలను తప్పనిసరిగా సమకూరుస్తామన్నారు.

తదనంతరం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో నీరు నిల్వ ఉండడాన్ని పరిశీలిస్తూ నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని రోడ్లు భవనాల శాఖ అధికారులను ఆదేశించారు.

అదేవిధంగా మరుగుదొడ్ల నిర్మాణాలను పరిశీలించాలని అవసరమైతే అదనంగా చేపట్టాలన్నారు.

కలెక్టర్ వెంట ఆర్అండ్బీ అధికారులు తానేశ్వర్, డి ఈ రాజేందర్ కౌన్సిలర్ భానోత్ హరి సింగ్ జడ్.పి.హెచ్.ఎస్ ప్రధానోపాధ్యాయులు కోట కనకయ్య ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మురళీధర్ స్వామి సిడిపిఓ డెబోరా అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తదితరులు పాల్గొన్నారు
—————————————————————-
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది.

Share This Post