అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఐసిడిఎస్ అధికారులతో సమీక్ష సమావేశం : జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన        తేది:26.11.2021
వనపర్తి

ప్రభుత్వం అందించిన మెనూ ప్రకారం అంగన్ వాడి పిల్లలకు, గర్భిణీలకు నాణ్యమైన ఆహారం అందించాలని జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష సంబంధిత అధికారులకు ఆదేశించారు.
శుక్రవారం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో అంగన్వాడీ కేంద్రాల పనితీరుపై ఐసిడిఎస్ అధికారులతో జిల్లా కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి అంగన్వాడీ కేంద్రంలో చదివే బాల, బాలికలకు నాణ్యమైన ఆహారం అందించాలని, గర్భిణీలకు పౌష్టికాహారం అందేలా చర్యలు తీసుకోవాలని ఆమె సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు తనిఖీ చేసిన వెంటనే వాట్సాప్ గ్రూపులలో సమాచారం అందించాలని ఆమె ఆదేశించారు. ప్రతి అంగన్వాడీ కేంద్రం తనిఖీ చేసి రిపోర్టులు వెంటనే పంపాలని, అంగన్వాడీ కేంద్రాలలో సిడిపిఓ, సూపర్వైజర్ పిల్లలతో కలిసి భోజనం చేయాలని ఆమె అన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన మరుగుదొడ్లు, టాయిలెట్లను ఏర్పాటు చేయాలని, అంగన్వాడి టీచర్లకు రిజిస్టర్లు, ట్యాబ్ లు పంపిణీ చేస్తామని ఆమె తెలిపారు.
ఈ కార్యక్రమంలో డీ.డబ్ల్యు.ఓ. పుష్పలత, సిడబ్ల్యూసి చైర్పర్సన్ అలివేలమ్మ, సభ్యులు విజయ్ కుమార్, నందిని, వనజ కుమారి, గిరిజ, కృష్ణ చైతన్య, సిడిపిఓ సూపర్వైజర్లు, తదితరులు పాల్గొన్నారు.
………..
జిల్లా పౌర సంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post