అంగన్వాడీ నిర్వహణ తీరును మెరుగు పరచాలి: జిల్లా కలెక్టర్ శశాంక

అంగన్వాడీ నిర్వహణ తీరును మెరుగు పరచాలి: జిల్లా కలెక్టర్ శశాంక

ప్రచురణార్ధం

మహబూబాబాద్, జనవరి,27.

అంగన్వాడీ ల నిర్వహణ తీరును మెరుగు పరచాలని జిల్లా కలెక్టర్ శశాంక ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో అంగన్వాడీ నిర్వహణపై జిల్లా మహిళ శిశు సంక్షేమ శాఖ అధికారిణి అధ్యక్షతన జిల్లా కలెక్టర్ సమీక్షించారు

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా లోని అంగన్వాడీ లలో 25సొంత అంగన్వాడి భవనాలు మోడల్ సెంటర్ గా తీర్చిదిద్దాలన్నారు. అందులో ప్రతి అంగన్వాడీ కేంద్రానికి 4. 30 లీటర్ల త్రాగునీటి వాటర్ క్యాన్ అందించేందుకు అంగన్వాడీల లో కరెంట్ సౌకర్యం, మైనర్ రిపేర్ వర్క్స్ వంటివి గ్రామ పంచాయతీ నిధుల నుండి చేయించాలన్నారు.

జూమ్ మీటింగ్ ద్వారా అంగన్వాడి టీచర్లకు హెల్పర్ లకు కు కిచెన్ గార్డెన్ శిక్షణ ఇవ్వాలని, అందరూ టీచర్లు బాగా పని చేయాలని అంగన్వాడి కేంద్రాలలో ఖాళీలు ఉన్న చోట ఇంచార్జ్ ని నియమించి విధులు నిర్వహించాలి . ప్రతి శుక్రవారం పోషణ దినోత్సవం నిర్వహించి బరువు తగ్గిన పిల్లల తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. పిల్లల ఆరోగ్య స్థితిని మెరుగుపరచాలన్నారు.

ఈ కార్యక్రమంలో శిక్షణ ట్రైని కలెక్టర్ అభిషేక్ అగస్త్య, డి డి దిలీప్ కుమార్, డి డబ్ల్యూ స్వర్ణలత, సి డి పి వో లు మరిపెడ, గూడూరు, డోర్నకల్,మహబూబాబాద్ శిరీష, నీలోఫర్ అజ్మీ, ఎల్లమ్మ, డెబోరా తదితరులు పాల్గొన్నారు.

Share This Post