అంగన్వాడీ సెంటర్లలో పిల్లల హాజరు వందశాతం ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ హాల్లొ స్త్రీ శిశు సంక్షేమ శాఖ జిల్లాలో పనితీరు పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్బంగా కలెక్టర్ వివరిస్తూ తాను ఏ మండలంలో సందర్శించిన అంగన్వాడీల్లో పిల్లల సంఖ్య నమోదు అయిన పిల్లల కంటే చాలా తక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించడం జరిగిందన్నారు. రాబోయే 15 రోజుల్లో ఈ పరిస్థితి మారాలని 95 నుండి 100 శాతం పిల్లలు హాజరు అయ్యేవిధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. అదేవిధంగా పాలిచ్చే తల్లులు సైతం అంగన్వాడీ కేంద్రానికి వచ్చి పౌష్టికాహారం తినివెళ్ళేవిధంగా వారికి అవగాహన కల్పించాలని ఆదేశించారు. వయసుకు తగ్గ ఎత్తు బరువు లేని పిల్లల విషయంలో బరువులు, ఎత్తులు సరిగ్గా తీయాలని స్యామ్ మ్యాం లో లేకుండా ఉండేందుకు తప్పుడు బరువులు నమోదు చేస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఒకవేళ తక్కువ బరువు ఉంటే అతనికి పౌష్టికాహారం అందించి లేదా వైద్యం చేయించి ఆరోగ్యం బాగుచేయవచ్చు తప్ప తప్పుడు లెక్కలు చూపిస్తే పిల్లలు నష్టపోతారని తెలియజేసారు. వారం పది రోజుల్లో సరిచేసుకోవాల ని ఆ తర్వాత తాను పర్యటించి
నప్పుడు ర్యాన్డం గా చెక్ చేస్తానని తేడాలు ఉంటే చర్యలు తప్పవన్నారు. ప్రతి బుధవారం ఒక పది నిమిషాలు అంగన్వాడీ కేంద్రంలో ఉన్న స్యామ్ మ్యాం పిల్లల తల్లులతో సమావేశం నిర్వహించి వారికి పిల్లవాడి పోషకాహార లోపం పై అవగాహన కల్పించి పౌష్టికాహారం అందించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. సూపర్వైజర్లు విధిగా ప్రతిరోజు అంగన్వాడిసెంటర్లు సందర్శించి అంగన్వాడీ టీచర్లకు అవగాహన కల్పించడం వారి పనితీరును పరిశీలించి తగు మార్పు చేర్పులు సూచించడం జరగాలన్నారు. అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని చాలా చోట్ల పరిశుభ్రత లేదని అన్నారు. రాబోయే వారం రోజుల్లో అన్ని అంగన్వాడీ కేంద్రాలు పరిశుభ్రంగా ఉండే విధంగా చూసుకోవాలన్నారు. చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ విభాగం వారి సమీక్ష సందర్బంగా మాట్లాడులుతూ జిల్లాలోని అనాధ పిల్లలు అందరూ గురుకుల పాఠశాల లేదా కెనిబివిల్లో ఉండాలని బయట ఉండకుండ చర్యలు తీసుకోవాలన్నారు. బడిబయట పిల్లల జాబితాను మండల విద్యాధికారి లేదా పాఠశాల ప్రధానోపాధ్యాయుడి తో తీసుకొని వారిని రెస్క్యూ చేసి తిరిగి పాఠశాలలో చేర్పించాలని ఆదేశించారు. బాల్య వివాహాలు, బాల కార్మికులు లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జిల్లా సంక్షేమ అధికారి వేణుగోపాల్, డి.సి.పి.ఓ కుసుమలత, సి.డి.పి.ఓ లు, సూపర్వైజర్లు, చైల్డ్ లైన్ ప్రొటెక్షన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.