అంగరంగ వైభవంగా సాగు నీటి దినోత్సవం నిర్వహించాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం……3

తేదీ.05.06.2023

అంగరంగ వైభవంగా సాగు నీటి దినోత్సవం నిర్వహించాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

*జూన్ 7న అన్నారం బ్యారేజి వద్ద లేజర్ లైట్ షో & గాయని మంగలి చే స్పెషల్ ప్రోగ్రాం

*అన్నారం బ్యారేజి ఇరువైపులా విద్యుత్ దీపాలతో అలంకరించాలి

*సాగు నీటి దినోత్సవం నిర్వహణ పై అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్.

జయశంకర్ భూపాలపల్లి, జూన్ -05:

జిల్లాలో సాగునీటి దినోత్సవాన్ని సాంస్కృతిక కార్యక్రమాలతో అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించాలని, దానికి తగిన విధంగా అన్నారం బ్యారేజ్ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధించిన అధికారులను ఆదేశించారు.

సాగునీటి దినోత్సవం వేడుకల నిర్వహణ పై సోమవారం నీటిపారుదల శాఖ, ఇతర జిల్లా అధికారులతో కలిసి అన్నారం బ్యారేజీని కలెక్టర్ సందర్శించారు.

జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ జూన్ 7వ తేదీ సాయంత్రం అన్నారం బ్యారేజ్ వద్ద నిర్వహించే సాగు నీటి దినోత్సవం కార్యక్రమాన్నీ అంగ రంగ వైభవంగా నిర్వహిచాలని అన్నారు.

జూన్ 7న సాయంత్రం 5.30 గంటలకు జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభమవుతుందని, రంజిత బృందంచే పేరిణి శివ తాండవం, శ్రవ్య మానస బృందం చే శాస్త్రీయ నృత్య ప్రదర్శన,లేజర్ లైట్ షో, మంత్రుల సందేశాలు, నేపథ్య గాయని మంగ్లీ బృందం మ్యూజికల్ లైవ్ షో కార్యక్రమాలు ఉంటాయని కలెక్టర్ తెలిపారు.

సాగినీటి దినోత్సవ వేడుకలు నిర్వహించే స్థలాన్ని పరిశీలించిన కలెక్టర్ కార్యక్రమానికి జిల్లా నలుమూలల నుండి జన సమీకరణ చేయాలని, ఈ కార్యక్రమంలో రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్,ఎం ఎల్ ఏ లు,ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొంటారని కలెక్టర్ అన్నారు .

సాగునీటి దినోత్సవ కార్యక్రమంలో సినీ గాయకురాలు మంగ్లీ, జానపద కళాకారులు, ప్రేరిణి నృత్యం,వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిచడం జరుగుతుందని, జిల్లాకు వచ్చే అతిథులకు ,అధికారులకు, ప్రజలకు భోజన సౌకర్యం ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు.

ఇరిగేషన్ అధికారులు అన్నారం బ్యారేజ్ కి ఇరు వైపులా విద్యుత్ లైటింగ్ తో అద్భుతంగా అలంకరించాలని కలెక్టర్ ఆదేశించారు. పార్కింగ్, మరియు బ్యారేజ్ లో నీరు కనబడేలా సెల్ఫీ వ్యూను ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలన్నారు.

సాగునీటి దినోత్సవం కార్యక్రమానికి మంత్రులు ప్రముఖ గాయకులు, విఐపి లు వస్తున్నందున పటిష్ట బందోబస్తు , పార్కింగ్, బారికేడింగ్, ఏర్పాటు చేయాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో సీ జడ్పి శ్రీహర్షిణీ, అదనపు కలెక్టర్ టి.ఎస్.దివాకర అసిస్టెంట్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, ప్రోగ్రాం ఈవెంట్ మేనేజర్, రవి, జిల్లా అధికారులు జెడ్పిటిసిలు, ఎంపిపి. సర్పంచ్ లు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి, జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post