అంగారికా టౌన్ షిప్ లో 120 ప్లాట్ లకు ప్రత్యక్ష వేలం ద్వారా అమ్మకం
రెండవ రోజు రూ.11.21 కోట్ల ఆదాయం మొత్తం రూ.22.70 కోట్లు
బుధవారం రోజున కొత్త డీడీలు తీసుకోవడం జరుగుతుంది
జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్
000000
తిమ్మాపూర్ మండలం నుస్తులాపూర్ గ్రామం అంగారికా టౌన్ షిప్ లోని ప్రత్యక్ష వేలం ద్వారా మంగళవారం వరకు 120 ప్లాట్ లను అమ్మడం జరిగిందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.
మంగళవారం కరీంనగర్ పట్టణంలోని వాసర గార్డెన్ లో రెండవ రోజు అంగారక టౌన్షిప్ లోని ప్లాట్ల ప్రత్యక్ష వేలం రెండవ రోజు 60 ప్లాట్లను వేలం వేయడం జరిగిందని తెలిపారు. వేలం ప్రక్రియ14వ తేదీ నుండి నవంబర్ 25వ తేదీ వరకు ఉంటుందన్నారు. రెసిడెన్షియల్ ప్లాట్లకు గజానికి 6000/-, కమర్షియల్ గజానికి రూ 8000/-లుగా నిర్ణయించడం జరిగిందన్నారు. మంగళవారం రోజున ప్లాట్ నెంబర్298 నుండి 357 వరకు 60 ప్లాట్ లకు ప్రత్యక్ష వేలం పాట ద్వారా అమ్మడం జరిగిందని, వేలంలో 11.21 కోట్ల రూపాయలు వచ్చినవని రెండు రోజుల్లో 120 ప్లాట్స్ వేలం వేయగా మొత్తం 22.70 కోట్లు ఆదాయం వచ్చిందని అన్నారు. మంగళవారం రోజు ప్రత్యక్ష వేలం పాటలో అత్యధికంగా చదరపు గజానికి రూ. 15400/- మరియు అతి తక్కువ చదరపు గజానికి ధర రూ.6600/- అమ్మడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
బుధవారం రోజున ప్లాట్ నెంబర్ 358 నుండి 417 ప్లాట్ల వరకు ప్రత్యక్ష వేలం వేయడం జరుగుతుందని, బుధవారం రోజున కొత్తగా డీడీలు కూడా తీసుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్ ,జి.వి. శ్యాంప్రసాద్ లాల్, జనరల్ మేనేజర్ జిల్లా పరిశ్రమల కేంద్రం నవీన్ కుమార్, డిసిపిఓ సుభాష్, తహసిల్దార్లు కనకయ్య, ఈ -డిస్టిక్ మేనేజర్ శ్రీనివాస్ రెడ్డి, ఏఈ చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.