అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి..

ప్రచురణార్థం

అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా కృషి చేయాలి..

కొత్తగూడ,
మహబూబాబాద్, 2021 డిసెంబర్ – 02:

అంతర్జాతీయంగా గుర్తింపు వచ్చేలా పట్టుదలగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ శశాంక విద్యార్థినులను కోరారు.

గురువారం కొత్తగూడ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలికల పాఠశాల, కళాశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా విద్యాలయంలో వసతి, తరగతి గదులు, డార్మేటరీ, మరుగుదొడ్ల వివరాలను, ఉపాధ్యాయుల, విద్యార్ధినుల హాజరు వివరాలను
అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినులకు ఇంకను కావాల్సిన వసతి, మరుగుదొడ్ల సౌకర్యం మెరుగు కొరకు ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు.

అనంతరం తరగతి గదులను, డార్మట్రి పరిశీలించారు.

10వ తరగతి, ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థినులతో మాట్లాడుతూ, జీవితంలో ఏమి కావాలో లక్ష్యాన్ని కేటాయించుకొని అందుకు తగ్గట్టుగా చదువుకుంటే అనుకున్నది సాధించవచ్చని అన్నారు. ఆర్ధికంగా, ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే కష్ట పడాలని, ఈ విద్యాలయం విద్యార్థినులు ఆరోగ్యంతో పాటు, చదువులో ముందు ఉండేలా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, విద్యార్థినులు ఆరోగ్యంగా ఉంటూ, ప్రణాళికాబద్ధంగా చదివి తల్లిదండ్రుల తో పాటు, తాము చదువుతున్న విద్యాలయానికి పేరు వచ్చేలా సమాజంలో ఉన్నత స్థానంలో నిలవాలని కోరారు.

చదువుతో పాటు క్రీడల్లో రాణించాలని సూచించారు. మండలం, జిల్లాకే పరిమితం కాకుండా అంతర్జతియంగా గుర్తింపు పొందేలా విద్యార్థినులు క్రీడల్లో, చదువులో ముందుండాలన్నరు. ఈ సందర్భంగా పిల్లలతో పోటీ పరీక్షల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంసెట్, నీట్, aims, ఇతర పరీక్షలలో పాల్గొనే విధంగా ముందుగా అవగాహన కలిగి, ఆ విధంగా చదవాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీటీడీఒ దిలీప్ కుమార్, అర్. సి. ఒ. రాజ్యలక్ష్మి, తహసల్దార్ నరేష్, విద్యాలయం ఇంచార్జీ ప్రిన్సిపల్ సుజాత, తదితరులు పాల్గొన్నారు.
———————————————————————————–
జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, మహబూబాబాద్ చే జారీ చేయనైనది.

Share This Post