అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతి చేసి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు-రాష్ట్ర పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్.

రంగారెడ్డి  జిల్లాలోని వ్యాపారస్థులు తాము తయారు చేసిన వస్తువులు అంతర్జాతీయ మార్కెట్ లో ఎగుమతి చేసి స్థానికంగా నిరుద్యోగులకు ఉపాధి కల్పించడానికి ప్రభుత్వం ద్వారా పూర్తి సహాయ సహకారాలు అందజేస్తామని రాష్ట్ర  పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్  తెలిపారు.

శుక్రవారం ఖైరతాబాద్ లోని జిల్లా  ప్రజా పరిషత్తు   కార్యాలయంలో జిల్లా పరిశ్రమ ల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎగుమతి దారులకు అవగాహన సదస్సు నిర్వహించారు. సదస్సుకు రాష్ట్ర పరిశ్రమల డైరెక్టర్ కృష్ణ భాస్కర్ జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించారు.

ఈ సందర్భంగా  పరిశ్రమల శాఖ డైరెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న ఆజాది కా- అమృత్ మహోత్సవములో భాగంగా వాణిజ్య ఉత్సవ్ సమావేశాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఎగుమతి దారులు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని తెలిపారు. జిల్లాలో పూలు, పండ్లు, కూరగాయలకు మంచి మార్కెట్ ఉందని వాటిని ఎగుమతి చేసుకునేందుకు బ్యాంకులు కూడా ఋణాలు అందించి 0.25 వడ్డి తీసుకుంటున్నారని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు  నూతనంగా ఏర్పాటు చేసే  పరిశ్రమలకు  టీ.ఎస్ఐ పాస్ కింద వెంటనే అనుమతులు జారీ చేస్తుందన్నారు.

రంగారెడ్డి జిల్లాలో 13 రంగాలకు చెందిన 44,19 పరిశ్రమలు ఉన్నాయని ఇందులో ఏరో స్పేస్ -రక్షణ ఆహార అభివృద్ధి , ప్లాస్టిక్ రబ్బర్ , కలప -లెదర్ , ఇంజనీరింగ్ , పేపర్ -ప్రింటింగ్, ఫార్మా రంగాలకు చెందిన పరిశ్రమలు
కొలువుదీరాయన్నారు.

ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆర్గనైజేషన్ జే. డీ శ్రీనాథ్, exim bank chief manager సుమేధా రాణి, ECGC AGM ఎం. శివ శంకరి అంతర్జాతీయంగా ఎగుమతి చేసేందుకు ఎలాంటి అవకాశాలు ఉన్నాయి, ఎలాంటి వస్తువులకు డిమాండ్ వుంటుంది, కొత్తగా వ్యాపారంలో చేరే వారు ఎలాంటి అనుమతులు తీసుకోవాలి, నిబంధనలు ఏ
విధంగా ఉంటాయి అనే పూర్తి వివరాలు  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా  వివరించారు. వివరించడమే కాకుండా వ్యాపారస్తులు అడిగిన పలు సందేహాలను . నివృత్తి చేశారు. అంతకుముందు జిల్లాలోని వ్యాపారస్తులు ఏర్పాటు చేసిన స్టాళ్లను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతీక్ జైన్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో  ఎస్ బీ.ఐ డీ.జీ.ఎం దేబాసిస్ మిశ్రా , ఎస్ ఐ డీ బీ.ఐ జనరల్ మేనేజర్ ప్రమోద్ కుమార్ ,
ఎఫ్ ఐ.ఈ. ఓ జేడి  పీ.టీ.శ్రీనాథ్ , జిల్లా పరిశ్రమల శాఖ  అధికారి రాజేశ్వర్ రెడ్డి , లీడ్ బ్యాంక్ మేనేజర్ రిజ్వాన్, ఉద్యానవన శాఖ అధికారి సునంద రాణి, వ్యవసాయ శాఖ అధికారి గీత రెడ్డి,  జిల్లాలోని వివిధ రంగాలకు
చెందిన  వ్యాపారవేత్తలు, రైతులు , మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు

.

Share This Post