అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్-01 వరంగల్ మహేశ్వరి గార్డెన్ లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు

అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్-01 వరంగల్ మహేశ్వరి గార్డెన్ లో ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అధికారులను ఆదేశించారు
శనివారం రోజున జిల్లా కలెక్టర్ సమావేశాల్లో వికలాంగుల సీనియర్ సిటిజన్స్ మహిళా శిశు వికలాంగ వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి శారద ఆధ్వర్యంలో కు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి అడిషనల్ కలెక్టర్ హరి సింగ్ అడిషనల్ కలెక్టర్ రెవెన్యూ శ్రీవత్సవ కోట జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి వెంకటరమణ లీడ్ బ్యాంక్ మేనేజర్ రాజ్
అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వికలాంగులను వయోవృద్ధుల ను సమాజంలో వారికి మంచి గౌరవం ఇస్తూ సేవ చేయాలని వారి కోసం ప్రత్యేకంగా ప్రజావాణి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు ఈ ప్రజావాణిలో వివిధ సమస్యలపై వారి నుండి 14 దరఖాస్తు స్వీకరించడం జరిగిందని ఇందులో 07 దరఖాస్తులు సదరన్ క్యాంపు లో వికలాంగుల సర్టిఫికెట్స్ పర్సంటేజ్ పై వచ్చినవని. మిగతావి సీనియర్ సిటిజెన్స్ ఇతర వికలాంగులకు వచ్చినవని చెప్పారు ఈ సమస్యలన్నిటినీ సాధ్యమైనంత త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు
అదేవిధంగా అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని అక్టోబర్-01 ఈ కార్యక్రమంపై వాల్ పోస్టర్స్ ను సంబంధిత అధికారులతో కలిపి కలెక్టర్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా చర్యలు చేపట్టామని తెలిపారు ఈనెల 24 నుండి30.09.2022 వరకు వారం రోజుల పాటు అనేక సాంస్కృతిక ,క్రీడలు చట్టాలపై అవగాహన, అనేక కార్యక్రమాలు నిర్వహించుకొని అక్టోబర్ 01 రోజున వరంగల్ మహేశ్వరి గార్డెన్ లో ముగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అంతర్జాతీయ వయో వృద్ధుల దినోత్సవానికి సీనియర్ సిటిజన్స్ హాజరుకావాలని అన్నారు ప్రతి శాఖలో పని చేసి పదవీ విరమణ పొంది సీనియర్ సిటిజన్స్ యొక్క సలహాలు సూచనలు ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు ఉపయోగించుకోవాలని ప్రతి శాఖలో పదవి విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ యొక్క బయోడేటా సేకరించాలని డి డబ్ల్య ఓ శారద ను ఆదేశించారు పెద్దల పట్ల నేటితరం చూపిస్తున్న వ్యవహారశైలిని పరిగణలోకి తీసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఈ సమస్యను చర్చించి వృద్ధుల దినోత్సవం జరుపుకునే ఆవశ్యకత అభినందనీయమని అన్నారు పుట్టిన మనిషికి వృద్ధాప్యం రాక మానదు అని ఇదంతా సృష్టిధర్మం అని రేపు మనం కూడా ముసలి వాళ్ళం అవుతామని మనం ఏ బాటలో నడిస్తే మన పిల్లలు కూడా అదే బాటలో నడుస్తారని తల్లిదండ్రులను ప్రేమించడం గౌరవించడం మన బాధ్యత అని చెప్పారు మన జీవితానికి మార్గ నిర్దేశకులు మన తల్లిదండ్రులు లేనని గుర్తుంచుకోవాలన్నారు అక్టోబర్ 1న జరిగే అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు

Share This Post