అంతర్జాతీయ స్థాయి లో రాణించాలి : జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రా రెడ్డి

పత్రిక ప్రకటన

నారాయణపేట జిల్లా

తేది: 16-09-2021

అంతర్జాతీయ  స్థాయి  లో రాణించాలి : జిల్లా  అదనపు కలెక్టర్ కె చంద్రా రెడ్డి

 

సాఫ్ట్ బాల్ క్రీడలలో జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక అయిన నారాయణపేట జిల్లా కేంద్రం లోని పరిమళ పురం  వీధికి చెందిన మోహన్ ను మధ్యాహ్నం కలెక్టరేట్  లో అదనపు జిల్లా కలెక్టర్ ఛాంబర్ లో  అదనపు కలెక్టర్ కె చంద్రా రెడ్డి  ప్రశంసించారు. శాలువా పూలమాల తో ఘనంగా సన్మానించి  జాతీయ స్థాయి లో జిల్లా పెరు ను నిల బెట్టాలని,  అంతర్జాతీయ స్థాయికి  ఎదగాలని కొనిఅడరు.    15 సెప్టెంబర్ నాడు  జనగామ జిల్లాలో జరిగిన తెలంగాణ రాష్ట్ర సబ్ జూనియర్ జట్టు ఎంపికైన 14  మంది  ఉత్తమ ప్రతిభ కనబర్చి నా వారి లో నారాయణపేట జిల్లా కు చెందినా విద్యార్ధి మోహన్  ఉండడం అభినందనీయమని అన్నారు. ఈ నెల 18 నుండి  ఒరిస్సా రాష్టం లోని కటక్  లో జరుగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక కావడం పై సంతోషకర విషయమని అన్నారు.  కొత్తగా ఏర్పడి నారాయణపేట  జిల్లా  లో softball అసోసియేషన్ ఏర్పడిన తర్వాత మొదటి సారి ఇలా జాతీయ స్థాయికి ఎంపికకవడం చాలా సంతోషకర విషయం అని జిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గందే చంద్రకాంత్ అభినందించారు.

ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి PET సాయినాథ్, జిల్లా SGF కార్యదర్శి రాం కళ్యాణ్ జి, పేట ts జిల్లా అధ్యక్షులు  కతలప్ప, PET లు వెంకటప్ప, మౌలాలి, రవీందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌరసంబందల అధికారి ద్వార జరి.

Share This Post