ప్రచురణార్థం
దంతాలపల్లి / మహబూబాబాద్ 25 జనవరి:
రేపోనీ, దంతాలపల్లిలో కంటి వెలుగు కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె శశాంక
వైద్యులు ప్రత్యేక శ్రద్ధతో ప్రజలకు అవగాహన కల్పించి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి కళ్ళజోడు అందించాలన్న జిల్లా కలెక్టర్
బుధవారం నాడు రేపోనీ, దంతాలపల్లి మండల కేంద్రం లోని పి హెచ్ సి సెంటర్లల్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కార్యక్రమాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ కంటి పరీక్షల కోసం వస్తున్న వారికి కనీస వసతులు కల్పించి, రిజిస్ట్రేషన్ లో పేర్లు నమోదు చేయాలని దూరదృష్టి దగ్గర దృష్టి కి తేడాలను కనిపెట్టి తగ్గట్టుగా కళ్ళజోడ్లను అందించాలన్నారు. కంటి చూపుతో బాధపడుతున్న వారికి సరైన అవగాహన కల్పించి ఎక్కువ స్క్రీనింగ్ లు నమోదుయ్యేటట్లు వైద్యులు ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు.
రేపోని ఉన్నత పాఠశాల హెచ్ఎం పై విద్యార్థుల సంఖ్య పెంచకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మన ఊరు మన బడి 31 లక్షల నిధులను ఎందుకు సద్వినియోగం చేసుకోవడం లేదంటూ సర్పంచ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైద్యులు కంటి వెలుగు యొక్క సమాచారాన్ని పూర్తిస్థాయిలో లేకపోవడానికి గల కారణాలు అడిగారు. దంతాలపల్లి పీహెచ్ఈ లో వైద్యులు నియమ నిబంధనలను పాటించి కంటి చూపు మందగిస్తున్న బాధితులకు సత్వరమే కంటి అద్దాలను పంపిణీ చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యశాఖ అధికారి హరీష్ రాజ్, డిప్యూటీ డి ఎం & హెచ్ ఓ గుండాల మురళీధర్, ఆర్ & బి ఈ ఈ తానేశ్వర్, ఆర్డిఓ ఎల్ రమేష్, మెడికల్ ఆఫీసర్ స్పందన, సి హెచ్ ఓ బాలాజీ, తహసిల్దార్ శివాని, ఎంపీడీవో విజయలక్ష్మి, సూపర్వైజర్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సర్పంచులు ప్రజా ప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు