అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తా…

ప్రచురణార్థం

అందరికీ డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇప్పిస్తా…

చీకటాయపాలెం
తొర్రూరు సెప్టెంబర్ 19.

అర్హులైన లబ్ధిదారులకు రెండు పడక గదుల ఇల్లు మంజూరు చేయిస్తానని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి మంచినీటి సరఫరా శాఖామాత్యులు ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.

ఆదివారం తొర్రూర్ మండలం చీకటాయ పాలెంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ , 30 లక్షలతో సిసి రోడ్డు శంకుస్థాపన , రెండు కోట్ల యాభై రెండు లక్షలతో యాభై రెండు పడక గదుల ఇండ్లకు మంత్రి జిల్లా కలెక్టర్ శశాంక తో కలిసి ప్రారంభోత్సవం చేశారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రియతమ రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కరోనా కష్ట కాలంలో కల్యాణలక్ష్మి ఆసరా పింఛన్లు రైతుబంధు వంటి పథకాలను నిరంతరంగా అమలుచేసి నిరు పేద ప్రజలకు అండగా నిలిచారని కొనియాడారు.
తన వంతుగా తమ ట్రస్టు తో నిత్యవసర వస్తువులు అందించానని ఆనందయ్య మందులు కూడా అందించడం జరిగిందన్నారు తొర్రూరు కు అంబులెన్స్ స్వయంగా తన సొంత ఖర్చుతో అందజేశానని, అదేవిధంగా ప్రభుత్వ హాస్పటల్ లో ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటు చేయించా నన్నారు.

దళిత బంధు పథకంతో నిరుపేదల జీవితాల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తానన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం నీరుతో ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసిందని ఇంటింటికి తాగునీరు అందించాలనే ఉద్దేశంతో గోదావరి నీటిని 50 వేల కోట్లతో చేపట్టడం జరిగిందన్నారు.

కరోనా వచ్చిన తట్టుకొని నిలబడే ఎందుకు ప్రభుత్వం వ్యాక్సిన్ కార్యక్రమం చేపట్టిందని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తీసుకోవాలన్నారు.

గ్రామస్తుల కోరికమేరకు పాలేరు వాగుపై చెక్ డ్యామ్, హరిపిరాల రోడ్డు, రైతుల విజ్ఞప్తి మేరకు ఒకటిన్నర కిలోమీటర్ల సూర్యాపేట రోడ్డు కనెక్టివిటీ త్వరలో చేపడతామన్నారు.

అనంతరం చేల్ల పాలెం లో వ్యాక్సినేషన్ ఈ కార్యక్రమాన్ని మంత్రి పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు
————————————–
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారి చే జారీ చేయడమైనది

Share This Post