అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

అందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 1: తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుతో పాటు జిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకుంటానని జనగామ జిల్లా నూతన కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. జనగామ కలెక్టర్ గా బుధవారం కలెక్టరేట్ లో ఆయన పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి సారిస్తూనే ప్రజా సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాముఖ్యతను ఇవ్వనున్నట్లు తెలిపారు. జిల్లా మంత్రి, ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు అర్హులకు చేరే విధంగా చర్యలు చేపట్టనున్నట్లు కలెక్టర్ అన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు ఏ. భాస్కర్ రావు, అబ్దుల్ హమీద్, జిల్లా అధికారులు నూతన కలెక్టర్ ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post