అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

అందుబాటులో ఉంటూ, మెరుగైన వైద్య సేవలు అందించాలి:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 13: ప్రజలకు అందుబాటులో ఉంటూ, మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య అన్నారు. సోమవారం కలెక్టర్ స్థానిక ధర్మకంచలోని పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. కేంద్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను కలెక్టర్ పరిశీలించారు. పట్టణ ఆరోగ్య కేంద్రానికి వస్తున్న రోజువారీ రోగుల సంఖ్యను, అందిస్తున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోవిడ్ పరీక్షలు, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. డెంగ్యూ, మలేరియా వంటి విష జ్వరాల ప్రమాదం అధికంగా ఉంటుందని, అప్రమత్తంగా ఉండాలన్నారు. అత్యవసర మందులు ప్రతి ఆరోగ్య కేంద్రంలో అందుబాటులో ఉండాలన్నారు. లక్షణాలున్న వారికి సంబంధిత పరీక్షలు చేపట్టాలన్నారు. జిల్లా కేంద్రంలోని తెలంగాణ డయాగ్నోస్టిక్ కేంద్రాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలకు పేదలే వస్తారని, మెరుగైన వైద్యంతో నమ్మకం పెంచాలన్నారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) అబ్దుల్ హామీద్, జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి డా. ఏ. మహేందర్, వైద్యాధికారిణి డా. కల్పనాదేవి తదితరులు ఉన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post