అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలి ….అదనపు కలెక్టర్ రాజర్షి షా

అందోల్- జోగిపేట మున్సిపాలిటీలో జరుగుతున్న వివిధ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తిచేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు.

మంగళవారం అడిషనల్ కలెక్టర్ రాజర్షి షా అందోల్ జోగిపేట మునిసిపాలిటీ పరిధిలో TUFIDC నిధుల తో చేపట్టిన పనులలో భాగంగా 12 వ వార్డు లో జరుగుతున్న మురికి కాలువ పనులను పరిశలించారు. ఇంకా పూర్తి చేయాల్సిన 110 మీటర్ల మురికి కాలువ నిర్మాణ పనులు 3 రోజులలోగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ ను ఆదేశించారు.

మురికి కాలువ నిర్మాణం లో అడ్డుగా వున్న చిన్న నిర్మాణాలను తొలగించి పనులు తొందరగా పూర్తి చేయాలని కమిషనర్ మరియు ప్లానింగ్ అధికారులకు ఆదేశించారు.

అనంతరం పట్టణం లోని స్టేడియం లో పాత్వేస్, గ్రీనరీ మరియు పెయింటింగ్ పనులను ప్రారంభించి పనులను సాధ్యమైనంత తొందరగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్ కు ఆదేశించారు. వాకర్స్ కాంపౌండ్ వాల్ లో కొన్ని చోట్ల పగులగొట్టినండున వాటిని తిరిగి కట్టాలని తెలిపారు. అనంతరం మునిసిపాలిటీ పరిధి లో జరుగుతున్న వాక్సినేషన్ ప్రక్రియ పరిశీలలించారు. అందొల్- జోగిపేట మునిసిపల్ పరిధిలో వాక్సినేషన్ ప్రక్రియ బాగా జరుగుతుందని, ఇంకా మొదటి డోసు తీసుకోని వారిని మరియు రెండవ డోసు గడువు పూర్తి అయిన వారిని గుర్తించి వాక్సినేషన్ తొందరగా పూర్తి చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో శ్రీమతి నిర్మల రెడ్డి కమిషనర్, కృష్ణ మోహన్ DEE Public Health గారు, సంజయ్, మునిసిపల్ ఇంజనీర్ గారు, వినయ్ శానిటరీ ఇన్స్పెక్టర్, వార్డ్ కౌన్సిలర్, బిక్షపతి, TMC గారు మరియు మునిసిపల్ రిసోర్స్ పర్సన్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post