అంధత్వం కలిగిన దివ్యాంగులకు లూయిస్‌ బ్రెయిలీ దిక్సూచి : జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి

అంధత్వం కలిగిన దివ్యాంగులకు దిక్సూచిలా నిలిచి వారి జీవితాలలో విద్య వెలుగులు నింపిన మహోన్నత వ్యక్తి లూయిస్‌ బ్రెయిలీ అని జిల్లా కలెక్టర్‌ భారతి హోళ్ళికేరి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని కాలేజ్‌రోడ్డులో గల సన్‌ పైన్‌ వయోవృద్ధుల దే కేర్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన లూయిస్‌ (బెయిలీ 218వ జయంతి వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ చాలా మంది చిన్న చిన్న సమస్యలకే నిరాశ నిస్సృహలకు లోనవుతారని, దృష్టి లోపం ఉన్న ఎంతో మంది ఎన్నో రంగాలలో రాణిస్తూ తమ ప్రతిభ కనబరుస్తూ ఆదర్భంగా, మార్దదర్శకులుగా నిలుస్తున్నారని అన్నారు. అంధత్వం కలిగిన వారు సైతం విద్యనభ్యసించే విధంగా లూయిస్‌ బెయిలీ లిపిని కనిపెట్టి అందించారని అన్నారు. అనంతరం అంధత్వం కలిగిన దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన లాప్‌టాప్‌లు అందించడంతో పాటు వివిధ రంగాలలో ప్రతిభ చూపిన వారిని సత్కరించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి మాస ఉమాదేవి, బాలల పరిరక్షణ అధికారి ఆనంద్‌, జైండ్‌ అసోసియేషన్‌ సభ్యులు, డే కేర్‌ సెంటర్‌ సభ్యులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post