అంబేడ్కర్ స్టేడియం లో వెనుకబడిన తరగతుల కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బి.సి.వసతి గృహ విద్యార్థులకు ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతున్నరాష్ట్ర బి.సి.సంక్షేమ శాఖ & పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్, పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై.సునీల్ రావు

బీసీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట

280 గురుకులాల ద్వారా1.52 లక్షల విద్యార్థులకు నాణ్యమైన విద్య

ఒక్కొక్క విద్యార్థిపై 1.25 లక్షల ఖర్చు

చదువుతోపాటు క్రీడల్లో రాణించాలి

ఉన్నత వర్గాలకు ధీటుగా బీసీలకు ఉద్యోగాలు రావాలి

రాష్ట్ర బీసీ సంక్షేమం పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్

0000000

వెనుకబడిన తరగతుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేసి గొప్ప గొప్ప పథకాలు అమలు చేస్తుందని రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

శనివారం బి ఆర్ అంబేద్కర్ స్టేడియంలో వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో బిసి వసతి గృహాల విద్యార్థిని విద్యార్థులకు నిర్వహించిన జిల్లా స్థాయి వేసవి సాంస్కృతిక పోటీ సంబరాలను జిల్లా కలెక్టర్ తో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు చదువు, ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రాధాన్యత ఇవ్వలేదని అన్నారు.  తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీసీలు ఆర్థికంగా, సామాజికంగా ముందుండాలనే ద్యేయం తో  రాష్ట్ర ప్రభుత్వం బీసీ సంక్షేమానికి కోట్లాది రూపాయలు వెచ్చించి గొప్ప గొప్ప పథకాలను అమలు చేస్తోందన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 9 గురుకులలు ఉండేవని అందులో 16 వేల మందికి మాత్రమే అవకాశం ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించేందుక 280 బిసి గురుకులాలను ఏర్పాటు చేసి అందులో 1.52 లక్షల మంది బిసి పిల్లలకు విద్యను అందించడం జరుగుతుందని ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి1.25 లక్షల రూపాయలు ఖర్చు చేయడం జరుగుతుందన్నారు. గతంలో ముక్కిపోయిన,దొడ్డు, పురుగుల బియ్యం వసతిగృహాల పిల్లలకు అందించే వారిని నేడు గురుకులాలకు నాణ్యమైన సన్న బియ్యం అందించడం జరుగుతుందన్నారు. బీసీలకు గొప్పగొప్ప పథకాలు అమలు చేయడంతోపాటు ఆత్మగౌరవ భవనాలనునిర్మించడం జరిగిందన్నారు. గతంలో యూ పి ఎస్ సి, ఏపీపీఎస్సీ ఒకసారి 1000 కంటే ఎక్కువ ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదని కానీ నేడు తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి 83 వేల ఉద్యోగ అవకాశం కల్పించిందన్నారు. ప్రతిభ ఉన్నవారికి కచ్చితంగా ఉద్యోగం వస్తుందని ప్రతిభను నమ్ముకుని ఉన్నత వర్గాలకు ధీటుగా బీసీలు ఉద్యోగాలు పొందాలన్నారు. అనంతరం మంత్రి బీసీ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనను తిలకించి విద్యార్థులకు సర్టిఫికెట్లను ప్రధానం చేశారు.

 

ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, నగర మేయర్ వై సునీల్ రావు, మున్సిపల్ కమిషనర్ సేవ ఇస్లావత్, జిల్లా వెనుకబడిన అభివృద్ధి అధికారి రాజమనోహర్, కార్పొరేటర్లు, బిసి సంక్షేమ వసతిగృహాల విద్యార్థిని విద్యార్థులు,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post