అంబేద్కర్ నగర్లో రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఆకస్మికంగా తనిఖీ చేసి కాలనీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు.


పత్రిక ప్రకటన:-

సిద్దిపేట లోని 37 వ వార్డు అంబేద్కర్ నగర్లో రాష్ట్ర మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఆకస్మికంగా తనిఖీ చేసి కాలనీలో నిర్వహిస్తున్న పారిశుద్ధ పనులను పరిశీలించారు.

తడి చెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను ఎలా సేకరిస్తున్నారని మున్సిపల్ కార్మికురాలిని అడిగి తెలుసుకున్నారు. తడిచెత్త, పొడి చెత్త, ప్లాస్టిక్ ను వేరువేరుగా మున్సిపల్ చెత్తను సేకరించి వాహనాలలో వేయాలని కాలనీ వాసులకు సూచించారు.

మురికి కాలువలో ప్లాస్టిక్, చెత్తాచెదారం, గాజు సీసాలు ఉండడంతో పరిశుభ్రమైన సిద్దిపేట ప్రజలందరి బాధ్యత అని చెత్తాచెదారం, ప్లాస్టిక్, గాజు సీసాలను ఎక్కడపడితే అక్కడ వేయరాదని కాలనీ వాసులకు సూచిస్తూ పారిశుద్ధ్య కార్యక్రమాలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని, త్రాగునీరుకు ఇబ్బంది కలగకుండా సక్రమంగా సరఫరా అయ్యేలా చూడాలని స్థానిక కౌన్సిలర్ సాకీ లక్ష్మి ఆనంద్ ను ఆదేశించారు.

మంత్రివర్యుల వెంట సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల సాయిరాం, నాయకులు రాజనర్సు తదితరులు ఉన్నారు.

Share This Post