అంభరాన్నంటిన తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలు

అంభరాన్నంటిన తెలంగాణ ఆవిర్బావ దశాబ్ది ఉత్సవాలు

 

 

     జిల్లాలో శుక్రవారం నాడు పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన తెలంగాణ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. దశాబ్దికాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ గారి ఆలోచన విధానాలతో సాధించిన ప్రగతిని, జిల్లాలో చేసిన అభివృద్ది పనులను మరియు తెలంగాణ రాష్ట్ర ఆవిర్బావం కొరకు ప్రాణాలను తృణప్రాయంగా సమర్పించి అమరులైన వీరులను గురించి స్మరించుకుంటు అంగరంగ వైభవంగా వేడుకలను నిర్వహించుకోవడం జరిగింది.  ఉదయం 08:30 ని.లకు జిల్లా కేంద్రంలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద జిల్లా కలెక్టర్, మానకొండూర్, చోప్పదండి ఎమ్యెల్యేలు, మేయర్ మరియ డిప్యూటి మేయర్ ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి రాష్ట్ర బీసి సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ నివాలులర్పించారు. అక్కడి నుండి నేరుగా ఉదయం 9 గంటలకు పోలీస్ పరెడ్ గ్రౌండ్ చేరుకున్న మంత్రి జెండాను  ఆవిష్కరించి మంత్రి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.  అనంతరం పరేడ్ గ్రౌండ్ లో వేడుకలకు హజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు, సమరయోదులకు అభివాదం చేసి తెలంగాణ ఆవిర్బవించిన దశాబ్దికాలంలో సాధించిన ప్రగతిని గురించిన సందేశాన్ని అందించారు.   తదనంతరం  అమరవీరుల కుటుంబాలను సన్మానించి  పోలీస్ రక్షణ దినోత్సవ పోస్టర్ ను ఆవిష్కరించారు.   జిల్లాలోని వివిధ శాఖలు తెలంగాణ ఆవిర్బావం నుండి అమలు చేసిన వివిధ పథకాలను గురించి వివరిస్తూ ఏర్పాటు చేసిన శకటాల ప్రదర్శనను, స్టాల్లను తిలకించారు.  చివరగా శకటాలను ప్రదర్శనలో ప్రతిభను కనబరిచిన వ్యవసాయశాఖకు మొదటి బహుమతి, దళితబందు పై రెండవ బహుమతి, పశుసంవర్దక శాఖకు మూడవ బహుమతి, డిఆర్డిఓ శాఖకు కన్షలేషన్ మంజూరు చేశారు. అందించారు.

 

 

     ఈ కార్యక్రమంలో జడ్పి చైర్పర్సన్ కనుమల్ల విజయ, జిల్లా కలెక్టర్ ఆర్.వి కర్ణన్, సిపి సుబ్బారాయుడు, మానకొండూర్, చోప్పదండి  ఎమ్మెల్యేలు  రసమయి బాలకిషన్, సుంకే రవిశంకర్   అదనపు కలెక్టర్లు గరిమ అగర్వాల్  జి.వి.  శ్యాం ప్రసాద్ లాల్  నగర మేయర్ వై సునీల్ రావు, సుడా చైర్మన్ జివి రామకృష్ణారావు   శిక్షణ సంయుక్త కలెక్టర్ నవీన్ నికోలాస్  ట్రేని కలెక్టర్ లెనిన్ వత్సల్ టోప్పో .

Share This Post