అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట నష్టాన్ని సర్వే చేయించి రైతులకు ప్రభుత్వంచే పరిహారమందిస్తాం :: జిల్లా కలెక్టర్ కె. శశాంక

అకాల వడగండ్ల వానకు దెబ్బతిన్న పంట నష్టాన్ని సర్వే చేయించి రైతులకు ప్రభుత్వంచే పరిహారమందిస్తాం :: జిల్లా కలెక్టర్ కె. శశాంక

ప్రచురణార్థం

నరసింహుల పేట / దంతాలపల్లి / తొర్రూరు / మహబూబాబాద్ 21 మార్చి 2023:

జిల్లాలోని వివిధ గ్రామాలలో అకాల వడగండ్ల వర్షాల కారణంగా నష్టపోయిన పంటలను సంబంధిత అధికారులతో పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె. శశాంక

మంగళవారం కలెక్టర్ జిల్లాలోని నర్సింహులపేట,దంతాలపల్లి తొర్రూరు మండలాల్లో విస్తృతంగా జిల్లా అధికారులతో పర్యటించి పంట నష్టం జరిగిన రైతులకు భరోసా కల్పిస్తూ తగు సూచన, సలహాలు చేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న అకాల వడగండ్ల వర్షానికి పంట నష్టపోయిన రైతుల పంటచేళ్లను స్వయంగా జిల్లా కలెక్టర్ సంబంధిత అధికారులతో పరిశీలించి, పంట నష్టం జరిగిన రైతులకు మనోధైర్యాన్ని కల్పించి ప్రభుత్వంకు నష్టపరిహారానికై సర్వే చేయించి పరిహారమందేటట్లుగా ప్రభుత్వంకు నివేదిక పంపనున్నట్లు జిల్లా కలెక్టర్ శశాంక తెలిపారు.

అకాల వడగండ్ల వర్షాల కారణంగా మామిడి తోట, మిర్చి, మొక్కజొన్న, వరి, పెసర, జొన్న తదితర నష్టపోయిన పంటలను సర్వే చేసి నష్టపరిహారం అందే విధంగా చర్యలు తీసుకోనున్నట్లు కలెక్టర్ తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలో నష్టపోయిన పంటలను అంచనా వేయాలని ఇప్పటికే అధికారులకు ఆదేశాలు జారీ చెయ్యనైనదని, అకాల వర్షాలకు పంటలు కోల్పోయిన రైతులను ఆదుకుంటామని కలెక్టర్ పేర్కొన్నారు.

ముందుగా నరసింహుల పేట మండలం బొజ్జన్నపేట, శివారు భీమ్లా తండాలలోను, దంతాలపల్లి మండలం బొడ్లాడ శివారు తేజ తండా తొర్రూరు మండలం హరిపిరాల దుబ్బ తండ గ్రామ శివారు భీముని తండాలో పంటచేళ్లను సందర్శించి పంట నష్టాన్ని గుర్తించి రైతులకు సలహాలు సూచనలు చేస్తూ ప్రభుత్వం నుండి పరిహారం అందిస్తామని మనోధైర్యాన్ని కల్పించారు.

ఈ కార్యక్రమంలో డి ఏ ఓ చత్రునాయక్, డి హెచ్ ఎస్ ఓ సూర్యనారాయణ, ఆర్డీవో ఎల్ రమేష్ తహసిల్దార్లు వివేక్, శివాని, నాగేంద్రబాబు, ఎంపీడీవో సత్యనారాయణ రెడ్డి, విజయలక్ష్మి, కుమార్, హార్టికల్చర్ రాకేష్, మండల సిబ్బంది, రైతులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post