.అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయ్యాలి.. …. వీలైనంత తొందరగా ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలి …. ధరణి లో పెండింగ్ పైల్స్ అన్ని తొందరగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

..అకాల వర్షాలతో ధాన్యం తడవకుండా తగిన ఏర్పాట్లు చేయ్యాలి..

…. వీలైనంత తొందరగా ధాన్యం సేకరణ పూర్తి చెయ్యాలి

…. ధరణి లో పెండింగ్ పైల్స్ అన్ని తొందరగా పరిష్కరించాలని
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

పత్రిక ప్రకటన:-
26 మే 2022

జిల్లా లో ప్రారంభించిన ఐకెపి సెంటర్ లలో దాన్యం సేకరణ వీలైనంత తొందరగా జరగాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం ఐడిఓసి కలెక్టర్ చాంబర్ లో డిఎం-డిటీ సివిల్ సప్లై, తహసీల్దారు లతో ధాన్యం సేకరణ పై సమీక్ష సమావేశం నిర్వహించారు. అక్కన్నపేట, హుస్నాబాద్ మండలాల్లో ధాన్యం సేకరణ ఇంకా 10-15 రోజుల్లో ముగుస్తాయి అని తెలిపారు. అన్ని సెంటర్లలో వసతులు కల్పించాలి.
అకాల వర్షాలతో ధాన్యం తడవొద్దు. రైతులు ఆగం కావొద్దని అలా చూడాల్సిన బాధ్యత స్థానిక తహసీల్దార్ . వీలైనన్ని టార్పాలిన్ లను అందుబాటులో ఉంచాలి. లేని పక్షంలో జిల్లా మార్కెట్ యార్డ్ అందుబాటులో ఉంచారు అక్కడి నుండి తెచ్చుకోవాలి అని తెలియజేశారు. ఎలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.అధికారులు, మిల్లర్లు సమన్వయంతో పని చేసి రైతుల్ని న్యాయం చెయ్యాలి.
.. ప్రతీ మండలం, గ్రామం వారీగా ప్రతీ కొనుగోళ్ల కేంద్రాన్ని తహసీల్దార్ లు సందర్శించి, రైతులకు ఏలాంటి సమస్యలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారుల కు ఉన్నదని సూచించారు. ఈ మేరకు కేంద్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో ఎదురవుతున్న సమస్యలను మండలాల వారీగా సమీక్ష జరిపారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేపట్టాలని తెలిపారు. మిల్లుల్ల వద్ద సైతం ఆయా డివిజన్ల ఆర్డీఓలు పరిశీలనలు చేయ్యాలి అని పేర్కొన్నారు. జిల్లాలోని అన్నీ మండలాల తహశీల్దార్లతో మిల్లుల వద్ద సిట్టింగ్ అధికారులతో సమీక్షించాలి.
కొనుగోళ్లను సజావుగా జరిపేలా ధాన్యం దిగుమతిలో మిల్లర్లు జాప్యం చేయకుండా సమస్యలు ఉత్పన్నం కాకుండా ఎప్పటికప్పుడు అక్కడికక్కడే సమస్యలు పరిష్కరించాలని అధికారులకు ఆదేశించారు. మిల్లర్లు ధాన్యం న్నీ సజావుగా దింపుకునేలా అధికారులు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ఆదేశించారు.

ధరణి పై తాసిల్దార్ లు, రెవెన్యూ అధికారులతో సమీక్ష జరిపారు. జిల్లాలో అన్ని మండలాల వారీగా పెండింగ్లో ఉన్న ఎన్ని వాటి పరిష్కారం ఎలా అనే దానిపై తాసిల్దార్ లకు దిశానిర్దేశం చేశారు. కోర్టు కేసులో ఉన్న పెండింగ్ దరఖాస్తులు, తాసిల్దార్ ల వద్ద ఉన్న పెండింగ్ దరఖాస్తులు ఎన్ని వాటికి సంబంధించిన పూర్వ పహానీలు ఇతరత్రా రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి ఎలాంటి పొరపాట్లు లేకుండా పరిష్కరించాలని తెలిపారు. ఒకవేళ ఎక్కడ ఎలాంటి సంబంధం లేకుండా దరఖాస్తు ఉంటే రిజెక్ట్ చేయాలని తెలిపారు.
జిల్లాలో ఎక్కడ మట్టి అక్రమంగా తవ్వకాలు జరగకుండా చర్యలు తీసుకోవాలి. గవర్నమెంట్ ల్యాండ్ లు ఆక్రమణలకు గురిచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని తెలియజేశారు. సర్వేయర్ సర్వే చేస్తే తప్పనిసరిగా పంచనామా ఇవ్వాలి. పెండింగ్లో ఉన్న సర్వే దరఖాస్తులు తొందరగా అధునాతన పద్ధతులు పరిష్కరించాలని తెలియజేశారు. పరిష్కరించిన ప్రతి రిపోర్టు ఆర్డిఓ తన దృష్టికి తీసుకురావాలని తెలియజేశారు.
ప్రజలు మళ్లీ మళ్లీ దరఖాస్తు పెట్టుకోకుండా సమస్యలను తొందరగా వేగంగా పరిష్కరించాలి అని అధికారులను ఆదేశించారు.

ఇట్టి కార్యక్రమంలో డిఆర్ఓ చెన్నయ్య, గజ్వేల్ ఆర్డిఓ విజేందర్ రెడ్డి, జిల్లా సివిల్ సప్లై అధికారి హరీష్ వివిధ మండలాల తాసిల్దార్ మరియు రెవెన్యూ యంత్రాంగం పాల్గొన్నారు

Share This Post