అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ముందుగా ఎరియల్ వ్యూ ద్వారా, తర్వాత స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ముందుగా ఎరియల్ వ్యూ ద్వారా, తర్వాత స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్

ప్రచురణార్థం

పెద్డవంగర/తొర్రూరు/మహబూబాబాద్.మార్చి.23

అకాల వర్షాల వల్ల నష్టపోయిన పంటలను ముందుగా ఎరియల్ వ్యూ ద్వారా, తర్వాత స్వయంగా పరిశీలించిన సిఎం కెసిఆర్

మహబూబాబాద్ జిల్లా, పాలకుర్తి నియోజకవర్గం, పెద్ద వంగర మండలంలోని రెడ్డి కుంట తండా, పోచారం, వడ్డే కొత్తపల్లి, బొమ్మకల్ రెవిన్యూ గ్రామాల్లో నష్టపోయిన పంటలను పరిశీలించిన సిఎం కెసిఆర్

పంటల నష్టాలపై సంబంధిత రైతులతో మాట్లాడిన సిఎం కెసిఆర్

తమకు జరిగిన పంట నష్టాలపై సిఎం కెసిఆర్ కు వివరించిన రైతులు

వాన పడిన కొద్ది గంటల్లోనే మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటించి, రైతులను ఓదార్చినట్లు సిఎం కెసిఆర్ కు తెలిపిన అన్నదాతలు

పంట నష్టాల అంచనాలను అధికారులు, రైతులతోపాటు సిఎం కెసిఆర్ కు వివరించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

అక్కడే పౌర సంబంధాలశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన, ఫోటో ఎగ్జిబిషన్ ను చూసిన సిఎం కెసిఆర్.

అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన వేదిక మీద నుండి సిఎం కెసిఆర్ రైతులనుద్దేశించి మాట్లాడారు.

పంటల నష్టాలకు ఎక్కడైనా రూ.3 వేలే ఇస్తారు.నేను హైదరాబాద్ నుండే ఈ ప్రకటన చేయవచ్చు. కానీ, నేను స్వయంగా పంటల నష్టాలు చూడాలనుకున్నాను. రైతులను ఓదార్చాలనుకున్నాను.

రైతులతో మాట్లాడాలని భావించాను. అందుకే వచ్చాను.

పంటలు నష్ట పోయిన రైతులకు ఎకరాకు రూ.10వేలు నష్ట పరిహారం ఇవ్వాలని అధికారులను ఆదేశిస్తున్నానని అన్నారు.

నేను వ్యవసాయం చేస్తాను.

మంత్రి నిరంజన్ రెడ్డి, దయాకర్ రావులు కూడా వ్యవసాయం చేస్తున్నారని స్వయంగా మేమంతా రైతులం కాబట్టి… వ్యవసాయాన్ని కిందికి పడనీయవద్దు…వ్యవసాయాన్ని ఇగ వెనక్కి పోనీయవద్దు
ఇంకా వ్యవసాయాన్ని అభివ్రుద్ధి చేయాలని అందుకే మేమంతా వచ్చామని మీకు ధైర్యం చెప్పడానికే వచ్చిన్నామని
మునపటిలాగా అగో అంటే ఆరు నెలలకు గాకుండా…
మీ నష్ట పరిహారాన్ని తొందరగానే చెల్లిస్తామన్నారు.

కౌలుకు తీసుకున్న రైతులను కూడా ఆదుకోవాలని ప్రభుత్వం దీనికి తప్పకుండా వారికి కూడా అండగా ఉంటుందని తెలిపారు.

రైతులే కౌలుదారులను ఆదుకునే విధంగా కలెక్టర్లు వ్యవహరించాలని రైతులే దయ తలచి వారిని ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలె అని అన్నారు.

కలెక్టర్లు రైతులను, కౌలు రైతులను పిలిచి మాట్లడతారని తెలిపారు. రైతులు పొందే పరిహారంలోనే ఎంతో కొంత కౌలు రైతులకు కూడా అందేవిధంగా చూస్తే… బాగుంటుంది

దేశంలో ఎక్కడాలేని విధంగా రైతులను ఆదుకుంటున్నది తెలంగాణ రాష్ట్రమే అని
పంట నష్టపోయిన రైతులు ఆందోళన చెందొద్దన్నారు. నిరాశ పడొద్దని రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటాం అని అన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్ రెడ్డి, సత్యవతి రాథోడ్, రైతు బంధు రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎంపీలు జోగినపల్లి సంతోష్ రావు,పసునూరి దయాకర్, ఎమ్మెల్సీ, మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, ఎమ్మెల్యే డి.ఎస్. రెడ్యానాయక్, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నెమరుగొమ్ముల సుధాకర్ రావు, చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సిఎం ఓఎస్డీ స్మితా సబర్వాల్, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్ రావు, జిల్లా కలెక్టర్ శశాంక, అడిషన్ కలెక్టర్లు అభిలాష అభినబ్, ఎం.డేవిడ్,సంబంధిత శాఖల అధికారులు, రైతులు ఉన్నారు.

Share This Post