అక్టోబర్ నెలాఖరు నాటికి నూరు శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనుదీప్, రాష్ట్ర ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.

బుధవారం కొత్తగూడెం క్లబ్బులో వైద్య శాఖ సిబ్బందితో వ్యాక్సినేషన్ ప్రక్రియపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలో నేటి వరకు 65 శాతం వ్యాక్సినేషన్ ప్రక్రియ జరిగినట్లు చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా వ్యాక్సిన్ లక్ష్య ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. ప్రాధిమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలో ఆశా, ఏయన్ఎమ్ లతో సమీక్ష నిర్వహించి నూరు శాతం వ్యాక్సిన్ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. గ్రామాల్లో ఎవరు వ్యాక్సిన్ వేసుకున్నారో లేదో మనకు తెలీదని, ఖచ్చితంగా ఆశా కార్యకర్తలకు తెలుస్తుందని, అందువల్ల వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి తప్పని సరిగా వ్యాక్సిన్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేసేందుకు 20 సంచార మొబైల్ వ్యాక్సిన్ వాహనాలను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ కార్యక్రమం నూరు శాతం జరగాలంటే ప్లానిన్డ్ మానర్ ప్రకారం వెళ్లాలని వైద్య సిబ్బందికి సూచించారు. ప్రాధమిక ఆరోగ్య కేంద్రాల వారిగా మొదటి, రెండవ డోస్ తీసుకున్న వారి వివరాల లెక్కలు పక్కాగా ఉండాలని చెప్పారు. లక్ష్యసాధనలో ఇప్పటి వరకు సాధించినది ఒకటైతే చివరి దశ చాలా ముఖ్యమని చెప్పారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ గురించి ఆళ్లపల్లి వైద్యుడిని అడిగి తెలుసుకున్నారు. మీ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చాలా తక్కువగా ఉన్నదని కారణాలు చెప్పకుండా లక్ష్యాన్ని సాధించు విదంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. వైద్యుడు చెప్పిన సమాధానానికి సంతృప్తి చెందని వారు అన్ని కేంద్రాల్లో వ్యాక్సిన్ మంచిగా జరుగుతుంటే మీ కేంద్రం  ఏమైనా ప్రత్యేకమా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉప, జిల్లా వైద్యాధికారులు వ్యాక్సినేషన్ కార్యక్రమం తక్కువగా జరుగుతున్న ఆరోగ్య కేంద్రాలను నిరంతర పర్యవేక్షణ చేస్తూ ముమ్మరం చేయాలని ఆదేశించారు. 33 జిల్లాలలో జరుగుతున్న వ్యాక్సినేషన్ సమాచారాన్ని నేను చెప్తుంటే మీ ప్రాధమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని సమాచారం తెలియకపోతే ఎలా అంటూ అసహనం వ్యక్తం చేశారు. నూరు శాతం వ్యాక్సినేషన్ జరిగిన గ్రామాల్లో క్రాస్ చెకింగ్ నిర్వహించాలని వైద్యాధికారులకు సూచించారు. వ్యాక్సినేషన్ జరిగిన గృహాలకు గుర్తుగా స్టిక్కర్ అంటించాలని చెప్పారు. రెండు సంవత్సరాల నుండి కరోనా వల్ల ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరికీ తెలిసిన విషయమేనని, ఇంకెన్ని రోజులు ఇబ్బందులు పడాలని, అర్ధం చేసుకుని వ్యాక్సిన్ పూర్తి చేయాలని చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపట్టేందుకు

ఆర్బిఎస్కే వాహనాలను వినియోగించు

కోవాలని చెప్పారు. మలేరియా, డెంగీ, టిబి, కరోనా వ్యాధి ప్రబలుతున్న హాట్ స్పాట్స్ గుర్తించి ప్రత్యేక చర్యలు చేపట్టాలని చెప్పారు. భద్రాద్రి జిల్లాను ఆరోగ్య జిల్లాగా తయారు చేయాలని,   మోడల్ ఆరోగ్య జిల్లా కావాలని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా వైద్యాధికారి డాక్టర్ శిరీష, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, వ్యాక్సినేషన్ ప్రోగ్రాం అధికారి డాక్టర్ నాగేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post