అక్టోబర్ లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం


అక్టోబర్ లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం

15- 29 సంవత్సరాల లోపు గ్రామీణ/ పట్టణ యువతీ, యువకులు మరియు విద్యార్థిని, విద్యార్థులకు

కవిత్వం, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ, ఉపన్యాస పోటీలు, సాంస్కృతిక పోటీలు( డాన్స్) పోటీలు
జిల్లా స్థాయి యువజన సమ్మేళనం

జిల్లా యువజన అధికారి యం. వెంకట రాంబాబు

0000000

నెహ్రూ యువ కేంద్ర ఆధ్వర్యంలో వచ్చేనెల అక్టోబర్ రెండవ వారంలో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా యువజన అధికారి ఎం వెంకట రాంబాబు తెలిపారు.

బుధవారం నెహ్రూ యువ కేంద్ర కరీంనగర్ కార్యాలయంలో నిర్వహించిన పత్రికా విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ లో వచ్చే నెల అక్టోబర్ లో జిల్లాస్థాయి యువ ఉత్సవ్ లో వివిధ పోటీలు కవిత్వం, పెయింటింగ్, మొబైల్ ఫోటోగ్రఫీ ఉపన్యాస పోటీలు సాంస్కృతిక పోటీలు( డ్యాన్స్) పోటీలు జిల్లాస్థాయి యువజన సమ్మేళనం ఉంటుందన్నారు. ఈ పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానంలో గెలుపొందిన వారికి నగదు బహుమతి ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ పోటీలలో 15-29 సంవత్సరాల లోపు వయస్సు గలిగిన గ్రామీణ యువతీ యువకులు మరియు విద్యార్థినీ విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చని ఆయన తెలిపారు. పైన సూచించిన ఆరాధ్య కలిగిన అభ్యర్థులు అందరూ ఆన్లైన్ లింక్ *https://forms. gle/Rom1vpqjz5pzde 63A. ద్వారా* తమ పేరును రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన తెలిపారు. జిల్లా స్థాయిలో ప్రధమ మరియు ద్వితీయ గెలుపొందిన అభ్యర్థులకు రాష్ట్రస్థాయి పోటీలకు పంపబడును. రాష్ట్ర స్థాయి పోటీలలో గెలుపొందిన వారిని జాతీయ స్థాయి పోటీలకు పంపబడుతారని ఆయన తెలిపారు.15-29 సంవత్సరాలలోపు వయస్సు గలిగిన గ్రామీణ/ పట్టణ యువతీ యువకులు అందరూ పాల్గొనవచ్చా అన్నారు. జిల్లాస్థాయి పోటీల తేదీని త్వరలో పత్రిక ప్రకటన ద్వారా తెలియజేయబడును అని అన్నారు. ఆసక్తి కలిగిన యువతీ యువకులు మరిన్ని వివరాల కొరకు నెహ్రూ యువ కేంద్ర కార్యాలయం లో లేదా *9177329258 – 9652782815* ఫోన్ నెంబర్ కు సంప్రదించవచ్చని ఆయన తెలిపారు.

ఈ సమావేశంలో జిల్లా యువజన మరియు క్రీడల అభివృద్ధి అధికారి రాజ వీరు,డిపిఆర్ఓ అబ్దుల్ కలీమ్,నెహ్రూ యువ కేంద్ర ప్రోగ్రాం అధికారి బి రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

Share This Post