అక్టోబర్ 1 నుండి  15వ తేదీ వరకు ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ పంచాయతీ, మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణ, ఇంటింటి నుండి వ్యర్థాలు సేకరణ, వర్మి కపోస్టు తయారు, వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు వినియోగం,  డ్రై డేలు నిర్వహణ తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. అంటువ్యాధుల నియంత్రణలో పారిశుద్యం చాలా ముఖ్యమైనదని చెప్పారు. అక్టోబర్ 1 నుండి 15 వ తేదీ వరకు నిర్వహిస్తున్న పారిశుధ్య కార్యక్రమాలపై ప్రతి రోజు నివేదికలు అందచేయాలని డిపిఓకు సూచించారు. ప్రత్యేక పారిశుద్య కార్యక్రమాలను డిపిఓ, జడ్పీ సిఈఓ, డిఆఆర్డీఓలతో పాటు డివిజనల్ పంచాయతీ అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేయాలని చెప్పారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణతో గ్రామాలు, పట్టణాలు వ్యర్దాలు లేకుండా పరిశుభ్రం కావాలని చెప్పారు. పారిశుద్య కార్యక్రమాలు నిర్వహణలో అలసత్వం వహిస్తే  కార్యదర్శులు, సర్పంచులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణ ద్వారా మాత్రమే  అంటువ్యాధులను నియంత్రణ చేయగలమని చెప్పారు. ఇటీవల కురిసిన వర్షాలకు మురుగునీటి నిల్వలు పెరిగిపోయి దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నదని, గ్రామాలు, పట్టణాల్లో మురుగునీటి నిల్వలు లేకుండా చర్యలు చేపట్టాలని చెప్పారు. మురుగునీటి నిల్వలున్న ప్రాంతాల్లో గంబూషియా చేపలు, ఆయిల్ బాల్స్, టెమోఫాస్ రసాయనాలు వేసి లార్వాను విచ్ఛినం చేయాలని చెప్పారు. అంటువ్యాధులు ప్రబలిన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్య శిభిరాలు నిర్వహించి వ్యాధి వ్యాప్తి జరగకుండా పటిష్ట నియంత్రణ చర్యలు చేపట్టాలని చెప్పారు. వర్షాలు వల్ల ఇండ్ల పరిసరాల్లో నీటి నిల్వలు పెరిగిపోయి దోమలు వ్యాప్తి జరిగే అవకాశం ఉన్నందున శుక్ర, మంగళవారాల్లో డ్రైడే నిర్వహించి పరిసరాలను పరిశుభ్రం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. పంచాయతీ కార్యదర్శులు డ్రై డే నిర్వహణ కార్యక్రమాలను పర్యవేక్షణ చేయుటలో భాగంగా ప్రతి ఇంటిని తనిఖీ చేయాలని చెప్పారు. ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు నిర్వహణలో దెబ్బతిన్న రహదారులను గుర్తించి మరమ్మత్తులు నిర్వహణకు సంబంధిత ఇంజనీరింగ్ అధికారులకు తెలియచేయాలని యంపిడిఓలను ఆదేశించారు. డంపింగ్ యార్డులు నిర్మాణాలు పూర్తిస్థాయిలో జరిగినందున ప్రతి ఇంటి నుండి సేకరించిన వ్యర్థాలతో వర్మికంపోస్టు తయారు చేయు విధంగా చర్యలు తీసుకోవాలని, వ్యర్దాలు నుండి పంచాయతీలు, మున్సిపాలిటీలు ఆదాయం సముపార్జన చేయాలని చెప్పారు.   వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు నిర్మాణంలో 80 శాతం కంటే తక్కువ ఎక్స్ పెండించర్  బుక్ చేసిన డిఈలు, ఏఈలకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని సంబంధిత పీఆర్  అధికారులకు సూచించారు. మరణించిన వ్యక్తుల అంతిమ కార్యక్రమాలు వైంకుఠదామాల్లో నిర్వహించాలని చెప్పారు. వైకుంఠదామాలు, డంపింగ్ యార్డులు వాడదామని అన్ని పంచాయతీలు తీర్మానం చేయాలని చెప్పారు. అక్టోబర్ 2వ తేదీన నిర్వహించనున్న గ్రామ సభల్లో  తీర్మానం చేయాలన్నారు. ఈ నెల 20వ తేదీనాటికి అన్ని వైకుంఠదామాల్లో నీటి సౌకర్యం కల్పించి నివేదికలను అందచేయాలని చెప్పారు. వైకుంఠదామంలో సౌకర్యాలు ఏర్పాటులో నిర్లక్ష్యంగా ఉన్న లక్ష్మీదేవిపల్లి యంపిఓ శ్రీనివాసరావుకు షోకాజ్ నోటీసుజారీ చేయాలని డిపిఓకు సూచించారు. వైకుంఠ దామాలు, డంపింగ్ యార్డులు షో కోసం నిర్మించుకోలేదని, నిర్మించి వదిలేశారని,  వినియోగంలోకి ఎందుకు తేవడం లేదని, వినియోగం లోకి తేవాల్సిన బాధ్యత యంపిడిఓ, యంపిఓ, కార్యదర్శి, సర్పంచులదే నని  చెప్పారు. ఈ వీడియో కాన్ఫరెన్సులో డిపిఓ రమాకాంత్, జడ్పి సిఈఓ విద్యాలత, అన్ని మండలాల యంపిడిఓలు, యంపిఓలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post