అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు ఆజాదిక అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు

అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు జాతీయ న్యాయసేవా సంస్థ ఆధ్వర్యంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని గ్రామాలలో ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పాన్ ఇండియా అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని అన్నారు.

 

గురువారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ తో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా అన్ని గ్రామాలలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను గుర్తించి ఉచిత న్యాయ సహకారం అందించి అపరిష్కుతంగా ఉన్న కేసులను పరిష్కరిస్తారని ఆమె తెలిపారు. ఇందుకు గాను టీం లను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. టీంలలో జ్యూడిషియల్ ఆఫిసర్, ప్యానల్ లాయర్, పారా లీగల్ వాలంటీర్, న్యాయ విద్యార్థులు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు, సోషల్ ఆక్టివిస్ట్స్ లు గ్రామ పెద్దల సమక్షంలో ప్రజల సమస్యలను పరిష్కరిస్తారని ఆమె తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 1279 గ్రామాలు ఉన్నవని సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మారుమూల గ్రామాలను సందర్శించి ఉచిత న్యాయ సహాయం అందిస్తారని తెలిపారు. గ్రామాలలో గల నిరక్షరాస్య ప్రజలను చైతన్యవంతం చేసి జిల్లా న్యాయసేవాధికారి సంస్థ ద్వారా లోక్ అదాలత్ ల ద్వారా ఎలాంటి డబ్బులు లేకుండా కేసులను పరిష్కరించుకొనుటకు అవగాహన కల్పిస్తారని తెలిపారు. ఈ న్యాయ సహాయ టీంలు గ్రామాలను సందర్శించినప్పుడు రెవెన్యూ, పోలిస్, పంచాయతి అధికారులు, మున్సిపల్ కమీషనర్లు తమ సహాయ సహకారాలు అందించాలని తెలిపారు. గ్రామాలలో ప్రజల వద్దకే న్యాయ సహాయం అనే పేరుతో ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు. అక్టోబర్ 2 నుండి నవంబర్ 14 వరకు జరుగు ఈ అవగాహన కార్యక్రమంలో అన్ని శాఖల అధికారులు సహకరించాలని కోరారు. గ్రామాలలో ఈ కార్యక్రమంపై అవగాహన పెంచుటకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ ఆజాదిక అమృత్ మహోత్సవ కార్యక్రమాన్ని అక్టోబర్ 2 న జిల్లా కోర్టు భవన సముదాయంలో ప్రారంభిస్తామని ఆమె తెలిపారు.

ఈ పాత్రికేయుల సమావేశంలో జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్, ఫస్ట్ అడిషనల్ జిల్లా జడ్జి భవాని చంద్ర, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి సుజయ్, ఏసిపి మదన్ లాల్, నగరపాలక సంస్థ డిప్యూటి కమీషనర్ రాజేశ్వర్ రావు, కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారి ఆనంద్ కుమార్,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post