అక్టోబర్ 2 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. బుధవారం గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు.

అక్టోబర్ 2 వ తేదీన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారని మంత్రులు హరీశ్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు తెలిపారు. బుధవారం గాంధీ హాస్పిటల్ ముందు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ విగ్రహం వద్ద జరుగుతున్న పనులను, బహిరంగ సభ స్థలాన్ని పరిశీలించారు. మంత్రుల వెంట MAUD స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్, DME రమేష్ రెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్, ఆసుపత్రి సూపరిండెంట్ రాజారావు లు ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి 2 వ తేదీన ముందుగా MG రోడ్ లో గల గాంధీ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తారని, అక్కడ నుండి గాంధీ హాస్పిటల్ వద్దకు చేరుకొని హాస్పిటల్ ముందు HMDA ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 16 పీట్ల మహాత్మా గాంధీ విగ్రహాన్ని  ఆవిష్కరించిన అనంతరం హాస్పిటల్ ఆవరణలో ఏర్పాటు చేసే బహిరంగ సభలో ప్రసంగిస్తారని చెప్పారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తెచ్చిన గాంధీ అనేక దేశాలకు స్పూర్తిగా, ఆదర్శంగా నిలిచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అలాంటి గాంధీ ని వదిలి గాడ్సే ని కోలుస్తున్న దౌర్బాగ్యపు వ్యవస్థను చూస్తున్నామని పేర్కొన్నారు. స్వతంత్ర వజ్రోత్సవాలలో భాగంగా రాష్ట్రంలోని పలు థియేటర్ లలో మహాత్మాగాంధీ జీవిత చరిత్ర ను తెలియజెప్పే సినిమాను ఉచితంగా ప్రదర్శిస్తే లక్షల మంది వీక్షించారని తెలిపారు. ఎంతో చరిత్ర కలిగిన గాంధీ ఆసుపత్రి వద్ద 16 ఫీట్ ల గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తుండటం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన మహాత్మాగాంధీ అనేకమందికి స్పూర్తిగా నిలిచారని అన్నారు. నెల్సన్ మండేలా లాంటి వారు గాంధీ చూపిన  అహింసా మార్గాన్ని అవలంభిస్తున్నారని చెప్పారు. కేసీఆర్ సైతం 14 ఏళ్ళు అహింసా మార్గంలో  రాష్ట్ర సాధన ఉద్యమం చేపట్టి తెలంగాణ ను సాధించారని తెలిపారు. కోవిడ్ సమయంలో అత్యద్భుత సేవలు అందించిన ఆసుపత్రిగా గాంధీ ఆస్పత్రికి ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రుల వెంట GHMC కమిషనర్ లోకేష్ కుమార్, నార్త్ జోన్ DCP చందన దీప్తి, ట్రాఫిక్ DCP యోగేష్ గౌతమ్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, RDO వసంత, R & B SE హఫీజుద్దిన్, I & PR CIEO రాధాకృష్ణ, HMDA SE పరంజ్యోతి తదితరులు ఉన్నారు.

 

MG రోడ్ గాంధీ విగ్రవం వద్ద పనులు పరిశీలించిన మంత్రి తలసాని

 

అక్టోబర్ 2 వ తేదీన గాంధీ జయంతి సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నివాళులు అర్పించనున్న MG రోడ్ లోని గాంధీ విగ్రహాన్ని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ MAUD  స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్  కుమార్ తో కలిసి పరిశీలించారు. అక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Share This Post