అక్టోబర్ 30 న వేతనంతో కూడిన సెలవు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

అక్టోబర్ 30 న వేతనంతో కూడిన సెలవు.

జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

-000-

రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు హుజురాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా పోలింగ్ తేది.30-10-2021 శనివారం రోజున హుజురాబాద్ శాసనసభ నియోజకవర్గం పరిధిలో వేతనంతో కూడిన సెలవును ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు. కరీంనగర్, హన్మకొండ జిల్లాల పరిధిలో గల హుజురాబాద్ నియోజకవర్గం లోని ఫ్యాక్టరిలు, దుకాణాలు, సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులకు, షాప్స్ అండ్ ఎస్టాబ్ల్సిష్ మెంట్ యాక్ట్ 1988, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951 ప్రకారం వేతనంతో కూడిన సెలవు దినంగా ప్రకటించినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. పోలింగ్ సందర్భంగా ప్రభుత్వం అక్టోబర్ 30, శనివారం సెలవు దినంగా ప్రకటించినందున ఫ్యాక్టరీలలో, దుకాణాలలో షాపులలో, సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, కార్మికులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకొవాలని కలెక్టర్ ఆ ప్రకటనలో కోరారు.

 

Share This Post