అక్టోబర్ 4న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ టి ఐ), పటాన్చెరు ప్రిన్సిపాల్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ నెల 4న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా

అక్టోబర్ 4న జాతీయ అప్రెంటీస్ షిప్ మేళా నిర్వహించనున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ (ఐ టి ఐ), పటాన్చెరు ప్రిన్సిపాల్ మరియు ఉమ్మడి మెదక్ జిల్లా నోడల్ అధికారి ఎన్. శ్రీనివాస్ రావు శుక్రవారం నాడు ఒక ప్రకటనలో తెలిపారు.

ఇట్టి అప్రెంటీస్ షిప్ మేళాలో 30కి పైగా కంపెనీలు పాల్గొననున్నట్లు తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థ బిడిఎల్ (భానూర్), మహేంద్ర అండ్ మహేంద్ర, ఏషియన్ పెయింట్స్, పెన్నార్, వెంట్రా ఎక్సెల్ క్రాఫ్ట్, వెల్జిన్ డేనిసన్, ఇతర కంపెనీలు అప్రెంటిస్ లను ఎంపిక చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. సుమారు 600 లకు పైగా అప్రెంటిస్ ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన ఐటిఐ ఉత్తీర్ణత పొందిన విద్యార్థులు http://apprentice shipindia.org పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు.

అక్టోబర్ 4న (సోమవారం) ఉదయం 9:00 గంటలకు బీరంగూడ కమాన్ వద్దగల పటాన్చెరు ఐటిఐ ప్రాంగణంలో నిర్వహించు జాతీయ అప్రెంటీస్ షిప్ మేళాకు అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డుతో హాజరుకావాలని తెలిపారు.

మరిన్ని వివరాలకు 8886381188 / 9440364259 /8328448815 ఫోన్ నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

ఇట్టి అవకాశాన్ని ఐటిఐ ఉత్తీర్ణులైన ఉమ్మడి మెదక్ జిల్లా అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Share This Post