అక్టోబర్ 7న ఎక్సైజ్ శాఖ జప్తు చేసిన వాహనం వేలం::జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. మహిపాల్ రెడ్డి

జనగామ, సెప్టెంబర్ 25: ఎక్సైజ్ శాఖచే జప్తు చేసిన వాహనాన్ని అక్టోబర్ 7న వేలం వేస్తున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆర్. మహిపాల్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి వాహనం లింగాలఘనపూర్ పోలీస్ స్టేషన్లో ఉన్నట్లు, ఎక్కడ ఉన్నది, అక్కడే ప్రాతిపదికన వేలం నిర్వహించనున్నట్లు ఆయన అన్నారు. ఇట్టి రన్నింగ్ కండీషన్ లో ఉన్న జెనాన్ పికప్ టర్బో గూడ్స్ వాహనం అప్ సెట్ ధరలో 50 శాతం బ్యాంకర్ చెక్/ డిమాండ్ డ్రాఫ్ట్/ పే ఆర్డర్ ద్వారా వేలానికి ముందుగా చెల్లించి వేలంలో పాల్గొనాలని ఆయన అన్నారు. లింగాలఘనపూర్ పోలీస్ స్టేషన్ వద్ద అక్టోబర్ 7న ఉదయం 11.00 గంటలకు వేలం నిర్వహించనున్నట్లు జిల్లా ఎక్సైజ్ అధికారి ఆ ప్రకటనలో పేర్కొన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారీ చేయనైనది.

Share This Post