అక్రమకట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

అక్రమకట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన                                                                                                                                                                                                                                                      తేదిః 27-08-2021

                                                              అక్రమకట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి  :: జిల్లా కలెక్టర్ జి. రవి

       జగిత్యాల, అగస్టు, 27 పట్టణాలలో టీఎస్‌-బీపాస్‌ (TS-bPASS) ద్వారా నిర్మాణాలకు అనుమతి పొంది నిబంధనలకు విరుద్దంగా నిర్మాణాలు జరిపే వారిపై కఠినంగా వ్యవహరించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు.  శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి మున్సిపల్, రెవెన్యూ సంబంధిత అంశాలపై మున్సిపల్ మరియు రెవెన్యూ అధికారులతొ జూమ్ వెబ్ వీడీయో కాన్ఫరెన్స్ నిర్వహించారు.  ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, పట్టణాలలో టీఎస్‌-బీపాస్‌ (TS-bPASS) ద్వారా భవన నిర్మాణ అనుమతుల కొరకు వచ్చిన ప్రతి ధరఖాస్తును అధికారులు క్షుణంగా పరిశీలించి అనివిధాల దృవీకరణలు సరైన విధంగా ఉన్నవాటికి మాత్రమే అనుమతులు మంజూరు చేయాలని,  అనుమతులు అతిక్రమించి నిర్మాణాలు చేపట్టినట్లయితే రెవెన్యూ అధికారులు మున్సిపల్ అధికారులతో కలిసి నిర్మాణాలను కూల్చివేయాలని అధికారులను ఆదేశించారు.  మున్సిపాలిటీలలో అనుమతులు పొందిన ప్రతి పని సకాలంలో పూర్తిచేయడాలని, ఇంకా ప్రారంభించని పనులు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు.  సివిల్ పనుల ఎంబి రికార్డునలు సక్రమంగా నిర్వహించాలని,  పనులు పూర్తయి వాటి చెల్లింపులో జాప్యం జరుగకుండా అధికారలు పర్యవేక్షించాలని సూచించారు.  అసంపూర్తి పనులపై కాంట్ట్రాక్టర్లతో సమావేశం నిర్వహించి త్వరితగతిన పనులు సకాలంలో పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలి, ఇకపై మున్సిపాలిటిల పనుల పురోగతిపై ప్రతివారంలో ఒకరోజు మున్సిపల్ కమీషనర్లతో సమీక్షించడం జరుగుతుందని,  మున్సిపల్ స్థాయిలో జరిగే  ప్రతి పనిని గురించి పూర్తిస్థాయి అవగాహన కలిగి ఉండాలని, పనుల నిర్వహణపై అధికారులు పూర్తిగా క్రిందిస్థాయి సిబ్బందిపై ఆధారపడి పనులు చేయకూడదని ఆదేశించారు.   బడ్జెట్ ప్రకారం పనులు సక్రమంగా జరగాలని, పరిపాలన అనుమతులు పోందిన పనులు పూర్తిచేయాలని, లేనట్లయితే చర్యలు తీసుకోవడం జరుగుతుందని అధికారులను హెచ్చరించారు. వార్డువారిగా పనులు పూర్తిచేయాలని,  పట్టణప్రగతి పనుల నిర్వహణలొ అలస్యం జరగడానికి వీలులేదని,  పనులు పూర్తికాకపోవడానికి గల కారణాలను అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు.  ఒపెన్ జిమ్ కొరకు ఉపయోగించే ఉపకరణాలలో ఏటువంటి అవకతవకలకు పాల్పడకుండా స్వయంగా పరిశీలించాలని అన్నారు.  పూర్తికాని పనులపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించాలని,  అనుమతులు పొందిన పనులు ప్రారంభించక పోవడం, సకాలంలో పూర్తిచేయకపోవడం లాంటివి జరగకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.  జిల్లాలో ఒకే విధమైన ట్రి గార్డులను కాకుండా వివిధ రంగులతో కూడిన ట్రిగార్ద్  తెప్పించాలని సూచించారు.  నాళా అక్రమణలు జరగకుండా అనుమతి లేని కట్టడాలు జరగకుండా బౌ0డ్రీ పిల్లర్లను ఏర్పాటు చేయడం, తొలగించడం వంటివి చేయాలని అన్నారు.  హరితహారం కార్యక్రమం,  మెగాపల్లెపకృతి వనం, ట్రిపార్కుల కొరకు స్థలాలను గుర్తించి ప్లానిటేషన్ పుర్తిచేయాలని,  పట్టణాలలో నిర్దేశించిన లక్ష్యం మేర వార్డు లేదా ఖాళీస్థలాల్లో ట్రీపార్కుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.  గ్రీన్ బడ్జేట్ కార్యక్రమం ద్వారా చేపట్టవలసిన పనులు 100% పూర్తికావాలని, వీది విక్రయదారులకు జీరోబ్యాలెన్స్ అకౌంట్ల ద్వారా ఋణాలను మంజూరు చేయించడంతో పాటు వారు తిరిగి చెల్లించేలా చూడాలని, సకాలంలో ఋణాలను తిరిగి చెల్లించిన వారికి 2వ విడతలో 15 వేలు చోప్పున ఋణాలు ఇప్పించడంపై అవగాహన కల్పించాలని పేర్కోన్నారు.  ఇప్పటి వరకు బ్యాంకు అకౌంటు లేనివారికి  జిరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేయించాలని, ఖాతాల ప్రారంభంలో ఇబ్బందులు తలెత్తినట్లయితే అధికారుల దృష్టికి తీసుకురావాలని పేర్కోన్నారు.   మున్సిపల్ వాహనాలన్నింటికి  జిపిఎస్ ఏర్పాటు చేసి పనులను పర్యవేక్షించాలని, కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు రిజీస్ట్రేషన్  చేయించాలని,  ఎప్రిల్ నుండి జూలై నెల వరకు ఇందన ఖర్చుల వివరాలను పంపించాలని ఆదేశించారు.  పనిచేయని స్థితిలో ఉన్న వాహనాలను ఖండేం చేయాలని,  రోడ్డుపై పాతాసామానులు కొనుగోలు చేసే దుఖాణాలు నిర్వహణ జరుగకుండా వారి స్వంతస్థలాల్లో తగిన జాగ్రత్తలతో తీసుకుని దుఖాణాలు నిర్వహించేలా చూడాలని, వెజ్ మరియు నాన్ వెజ్ మార్కేట్ల  కొరకు స్థలాలు గుర్తించి నివేధిక పంపించాలని పేర్కోన్నారు.   సానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని, సీజనల్ వ్యాదులు సంక్రమించే అవకాశాలు ఎక్కువగా ఉన్నందున ప్రత్యేక సానిటేషన్ కార్యక్రమాలు చేపట్టాలని,  సెప్టెంబర్ 1 నుండి పాఠశాలలు పునఃప్రారంభం కానున్న తరుణంలో ఒకరోజు ముందుగానే అన్ని పాఠశాలలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.

అనంతరం తహసీల్దార్లు, ఆర్డిఓలు, డిటిసిఎస్, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులతో వివిధ రెవెన్యూ సంబంధిత అంశాలపై సమీక్షిస్తూ,  ధరణి ద్వారా రిజిస్ట్రేషన్ కొరకు ధరఖాస్తు చేసుకొని ఫీజు చెల్లించకపోవడం, ఇతర కారణాలతొ  పెండింగ్ లో ఉన్న వాటిపై చర్యలు తీసుకోవాలని, తహసీల్దార్లు, దరణి ఆపరేటర్లు సకాలంలో లాగిన్ కావాలని  పేర్కోన్నారు.  భూ సంబంధిత, పిఓబి ఫిర్యాదులను పరిష్కరించగలిగే వాటిపై చర్యలు తీసుకోవాలని, పరిష్కరించలేని వాటిని వెంటనే తిరస్కరించి పూర్తిచేయాలని పేర్కోన్నారు.  కార్యాలయాలలో ఏపనికూడా పెండింగ్ ఉండకుండదని,  TS b PASS ద్వారా  పట్టణాలలో కట్టడాలకు అనుమతులు మంజూరుచేసే క్రమంలో అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని, అనుమతులు అతిక్రమించిన వాటిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.  అనుమతుల కొరకు వచ్చిన ధరఖాస్తులపై అలస్యం జరగకుడదని,  సర్వే చేయవలసినవి జిల్లావారిగా పెండింగ్ ఉన్నవాటి వివరాలను గురించి తెలుసుకొని, చర్యలు తీసుకున్న వాటి వివరాలను వాకబుచేసారు.  అప్పిలు పిటీషన్లు, ఎఫ్ లైన్ సర్వే త్వరగా పూర్తిచేసి పంచనామా కాపీలను అందజేయాలని పేర్కోన్నారు.  జిల్లాలో 13మంది  రెగ్యూలర్ సర్వేయర్లు ఉన్నందున,  లైసెన్స్ సర్వేయర్లతో సర్వే పనులు చేయించరాదని, మండలాల్లో సర్వేయర్లు పంచనామ కాపిలు ఇస్తున్నార పర్యవేక్షించాలని పేర్కోన్నారు.  డీలర్లు లాగిన్ లు నామినీల ద్వారా ఎందుకు జరుగుతుందో పరిశీలించాలని,  దుఖాణాల ద్వారా లబ్దిదారులకు సరుకుల పంపిణిలో ఎలాంటి అవకతవకలకు జరగకుండా పర్యవేక్షించాలని, బియ్యం అక్రమరవాణాపై అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని,  రైస్ మిల్లులపై తనిఖీలు నిర్వహించాలని,  బియ్యం అక్రమ రవాణ జరుగకుండా కట్టుదిట్టంగా వ్యవహరించి ఎప్పుడు ఆకస్మీక తనిఖీలు చేయాలని ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ,  జగిత్యాల, కోరుట్లు ఆర్డిఓలు శ్రీమతి ఆర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్,  పౌరసరఫరాల శాఖ అధికారి చందన్ కుమార్, సర్వే శాఖాధికారి, మున్సిపల్ కమీషనర్లు, తహసీల్దార్లు, సర్వేయర్లు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

అక్రమకట్టడాలపై కఠిన చర్యలు తీసుకోవాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

Share This Post