అక్రమ ఇసుక తరలింపు ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలి: జిల్లా కలెక్టర్ నిఖిల..

అక్రమ ఇసుక తరలింపు ను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిఖిల అన్నారు.
సోమవారం కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో ఇసుక అక్రమ తరలింపు ఫై జిల్లా ఎస్పీ కోటిరెడ్డి తో కలిసి కలెక్టర్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ లు, ప్రభుత్వం చేపట్టే వివిధ పనులకు గాను అనుమతులు ఉన్న ఆరు ప్రాంతాలలో మాత్రమే ఇసుక తవ్వకాలకు అనుమతి ఇవ్వడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పనులకు కూడా ఎంత ఇసుక అవసరం ఉన్నది, ఎంత తరలిస్తున్నారని విషయాన్ని కూడా సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు జిల్లాలో అక్రమ ఇసుక రవాణాను కట్టడి చేయాలి అంటే రెవెన్యూ, పోలీస్, మైనింగ్ శాఖల అధికారులు సమన్వయంతో పని చేయవలసిన అవసరం ఉందని కలెక్టర్ అన్నారు. అక్రమ ఇసుక రవాణను అరికట్టేందుకు జిల్లాలో 6 చెక్ పోస్టులను , 2 ఫ్లయింగ్ స్క్వాడ్ ను ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ, పోలీసు , మైనింగ్ శాఖల నుండి ఆరుగురు అధికారుల చొప్పున కమిటీలు వేసి సమన్వయంతో పని చేసినట్లైతే , అదేవిధంగా ఆరు టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేసినట్లయితే ఇసుక అక్రమ రవాణాను అరికట్టవచ్చని కలెక్టర్ అన్నారు. జిల్లాలోని కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఫిల్టర్ ఇసుక ను తయారు చేస్తున్నారని అటువంటి వాటిని తొలగించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో వాహనాలకు నెంబర్ లేకుండా ఇసుక తరలిస్తున్నారని తహసిల్దార్లు కలెక్టర్ దృష్టికి తీసుకురాగా అటువంటి వాహనాలను సీజ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. ఇసుక తవ్వకాలను అరికట్టేందుకు వాహనాలు వెళ్లే దారులకు కందకాలు, కంప ఏర్పాటు చేయాలని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో ఇసుక లభ్యతను బట్టి శాండ్ టాక్సీ పాలసీని తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ అన్నారు.
ఈ సమావేశంలో డి ఆర్ డి ఓ కృష్ణన్ పంచాయతీరాజ్ ఇఇ శ్రీనివాస్ రెడ్డి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడి రామ్ రెడ్డి వికారాబాద్, తాండూరు ఆర్డీవోలు విజయ కుమారి, అశోక్ కుమార్, తాసిల్దార్ లు పాల్గొన్నారు.

Share This Post