ప్రచురణార్ధం—-2
తేదీ.28.4.2022

జగిత్యాల, ఏప్రిల్-21: జిల్లాలో
అక్రమ ఇసుక రవాణా జరుగకుండా తగు చర్యలు తీసుకోని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని, వాహనాలు సీజ్ చేసి పెనాల్టీలు విధించాలని, ఇసుక అక్రమ రవాణా పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి రెవెన్యూ సర్వీసులు , వరి కొనుగోలు, పరీక్షల నిర్వహణ ఇతర అంశాలపై రెవెన్యూ అధికారులతో జూమ్ వెబ్ కాన్పరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సదర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఖాళీ గా ఉన్న రేషన్ షాపులు కారుణ్య నియామకాల ప్రక్రియ పెండింగు లో ఉండకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. జిల్లాలో ఉన్న రెండు డివిజన్ల వారీగా ఆర్డీవోలు రేషన్ షాపులు కారుణ్య నియామకాల ప్రక్రియ పై ఎప్పటికప్పుడు నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం జరిగిందని అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా మండలాల వారీగా నాణ్యత ప్రమాణాలతో కూడిన ధాన్యం కొనుగోలు చేసేవిదంగా, లోడింగ్, ఆన్ లోడింగ్ తహసీల్దార్లు పర్యవేక్షించాలని, కలెక్టర్ ఆదేశించారు.మండలాలలో రైస్ మిల్లర్ల వారీగా పెండింగ్ ఉన్న సీఎంఆర్ రైస్ డెలివరీ నివేదికను అందజేస్తామని తహసీల్దార్లు రైస్ మిల్లర్ల పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ మరియు మీసేవా పెండింగ్ దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని, కళ్యాణ లక్ష్మీ చెక్కులు ప్రభుత్వ నిబంధనల మేరకు స్థానిక ఎమ్మెల్యేలు, రెవెన్యూఅధికారులు మాత్రమే పంపిణీ చేయాలని , వేరే ఇతరులతో పంపిణీ చేయరాదని తెలిపారు.
ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చిన ప్రతి పిటీషన్ల పై సత్వరమే చర్యలు తీసుకొవాలని సూచించారు.ప్రజావాణి ద్వారా వచ్చిన దరఖాస్తులు, సీఎం కార్యాలయం నుండి వచ్చిన దరఖాస్తుల పరిష్కారంపై మండలాల వారీగా కలెక్టర్ సమీక్షించారు.
ఈ ఆఫీస్ ద్వారా ఫైళ్లను త్వరగా పరిష్కరించాలని పేర్కోన్నారు. పెండింగ్ మ్యూటేషన్లు, చెక్ మెమోలపై మీ సేవా సెంటర్ల ద్వారా మాత్రమే ధరఖాస్తులు చేసుకోవాలని, సిబ్బందికి రావాల్సిన ఆర్థిక ప్రయోజనంలు , సర్వీసు మ్యాటర్లు ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని అన్నారు. చౌకధరణ దుకాణాల పై తరుచూ తనిఖీలు నిర్వహించి బియ్యం అక్రమ రవాణా జరుగకుండ చర్యలు తీసుకోవాలని, ఆదేశించారు.
మండలాల్లో ఈ ఆఫీస్ వినియోగంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. తసీల్దార్ కార్యాలయంలో పెండింగులో ఉన్న పన్నులు వివరాలు కలెక్టరేట్ కు వివరాలు సమర్పించాలని ఆదేశించారు. ఇంటర్, పదవ తరగతి పరీక్షలు సమయాల్లో విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చూడాలని, పరీక్ష కేంద్రాలు తనిఖీ చేసి వసతులు కల్పనకు, రవాణా సౌకర్యాలు ఏర్పాటు కు తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, ఇంచార్జి అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల ఆర్డిఓ శ్రీమతి మాదురి, 18మండలాల తహసీల్దార్లు , ఏ ఓ , కలెక్టరేట్, పర్యవేక్షకులు, సిబ్బంది, తదితరులు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారి చేయనైనది.