అక్రమ కట్టడాలను తక్షణం తొలగించాలి…

ప్రచురణార్ధం

అక్రమ కట్టడాలను తక్షణం తొలగించాలి…

మహబూబాబాద్, నవంబర్,25.

అక్రమ కట్టడాలు తొలగించాలని ప్రభుత్వ స్థలాలు పరిరక్షించాలని అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు.

గురువారం కలెక్టర్ కార్యాలయంలో మున్సిపల్ , పోలీస్, రెవిన్యూ అధికారులతో జిల్లా టాస్క్ పోర్స్ కమిటీ సమావేశం నిర్వహించి అదనపు కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ స్థలాలకు బోర్డ్ లు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేపడితే తక్షణం నోటీస్ ఇచ్చి తొలగించాలన్నారు.

అనుమతులు పొందనిదే నిర్మాణాలు చేపట్టారదని తెలియ జేయాలని, అధికారులు పర్యటించాలన్నారు.

ఈ సమావేశంలో మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్ లు, పోలీస్ అధికారులు, రెవిన్యూ అధికారులు, రోడ్లు భవనాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
———————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, కార్యాలయం…మహబూబాబాద్ వారిచే జారిచేయనైనది

Share This Post