అక్రమ కట్టడాల వివరాలను సేకరించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి

అక్రమ కట్టడాల వివరాలను సేకరించాలి జిల్లా అదనపు కలెక్టర్ కె చంద్రారెడ్డి

జిల్లా లో ఉన్న అక్రమ కట్టడల వివరాలను సేకరించాలని శుక్రవారం కలెక్టరేట్ లో  అదనపు కలెక్టర్ కె చంద్ర రెడ్డి తన ఛాంబర్ లో నిర్వహించిన జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీ  సభ్యు లతో సమావేశం లో  ఆదేశించారు. అనుమతి లేకుండా నిర్మాణాలు చేపట్టిన వాటి వివరాలు మరియు అనుమతులు విరూదంగా నిర్మాణ ల వివరాలను అలాగే అనుమతి లేని లేవోట్స్ ల వివరాలను సేకరించాలని సూచించారు. వివరాలు సేకరించడాని కై  ప్రతి వార్డు కు ఓ అధికారిని నియమించడం  జరిగిందని అధికారి సేకరించిన వివరాలను కమీటీ ముందు మంగళవారం వరకు అందజేయాలని ఆ నిర్మాణాల పై తదుపరి కమీటీ చర్యలు చేపట్టే అవకాశం ఉందన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ప్రతాప్, CI  శ్రీకాంత్ రెడ్డి, మూడు మున్సిపాలిటీల కమిషనర్ లు టౌన్ ప్లానింగ్ అఫిసెర్ లాలప్ప తదితరులు పాల్గొన్నారు.

Share This Post