అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రారంభదశలోనే చర్యలు తీసుకోవాలి :: జిలా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 25-11-2021
అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రారంభదశలోనే చర్యలు తీసుకోవాలి :: జిలా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, నవంబర్ 25: జిల్లాలో జరిగే ప్రతి నిర్మాణం అనుమతుల మేరకు మాత్రమే జరగాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి వివిధ రెవెన్యూ సర్వీసులు, TS B Pass పనులపై పురోగతిపై అధనపు కలెక్టర్లు, ఆర్డిఓలు, తహసీల్దార్ లతో జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రతి వార్డుకు ఓక ప్రత్యేక అధికారిని నియమించడం జరిగిందని, నిర్మాణాలు అనుమతుల మేరకు మాత్రమే జరిగేలా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని, అక్రమనిర్మాణాలను ప్రారంభదశలోనే గుర్తించి ఎవరివైన సరే చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని పేర్కోన్నారు.
తహసీల్దార్, ఎమ్మెల్యే ల వద్ద కళ్యాణలక్ష్మీ/ షాధిముబారక్ ధరఖాస్తులు పెండింగ్ లేకుండా చూడడంతో పాటు వాటిని బడ్జెట్ ప్రకారం పూర్తిచేసి లబ్దిదారులకు సకాలంలో అందించాలని సూచించారు. బి ఆండ్ ఎస్ఎల్ ఏ నుండి ఎటువంటి సర్టిఫికేట్ కూడా పెండింగ్ లేకుండా చూడాలని, సర్టిఫికేట్ల జారిలో ఏవైన సమస్యలు ఉన్నట్లయితే ధరఖాస్తుదారులకు తెలియజేసి వాటిని పరిష్కరించాలని, ప్రజావాణి ద్వారా వచ్చిన సర్టిఫికేట్లపై సకాలంలో చర్యలు తీసుకోవాలని, స్లాట్ బుక్కింగ్, పెండింగ్ మ్యాటేషన్ పెండింగ్ లేకుండా చూడాలని, ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్ పై పెండింగ్స్ పరిష్కరిచాలని, సక్సేషన్ కేసులు పెండింగ్ లేకుండా చూడాలని, ఎటువంటి పిఓబి పెండింగ్ లేకుండా తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని, సీలింగ్ భూముల కొరకు రికార్డులు మెయిన్ టెయిన్ చేయాలని, ఇసుక రీచ్ లకు అనుమతులు మంజూరు చేయడం జరిగిందని, అనుమతుల మేరకు మాత్రమే ఇసుక రవాణ జరిగేలా చూడాలని తెలిపారు.
ఓటరు తుది జాబితాలో పూర్తిచేయాలని, చనిపోయిన వారిన వివరాలను జాబితా నుండి తొలగించాలని, 18 సంవత్సరాలు నిండిన వారిని ఓటరు జాబితాలో చేర్చడంపై అధికారులు దృష్టిసారించాలని, ఎవరకు కూడా విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించరాదని, విధులపై నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తీసుకోవాలి పేర్కోన్నారు.

అక్రమ నిర్మాణాలు జరగకుండా ప్రారంభదశలోనే చర్యలు తీసుకోవాలి :: జిలా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనిది.

Share This Post