అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపైనా కొరడా ఝుళిపించాలి జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ. క్షేత్ర స్థాయిలో నిఘాను ముమ్మరం చేయాలి

పత్రిక ప్రకటన
తేది :04.11.2022
నిర్మల్ జిల్లా శుక్రవారం

అక్రమ లే అవుట్లు, నిర్మాణాలపైనా కొరడా ఝుళిపించాలి
జిల్లా పాలనాధికారి ముష ర్రఫ్ ఫారుఖీ.
క్షేత్ర స్థాయిలో నిఘాను ముమ్మరం చేయాలి

జిల్లాలో అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాలను గుర్తిస్తూ నిబంధనలకు అనుగుణంగా కఠిన చర్యలు చేపట్టాలని తహసీల్దార్ లను జిల్లా పాలనాధికారి ఆదేశించారు.
శుక్రవారం జిల్లా పాలనాధికారి మినీ సమావేశం మందిరంలో ఆర్డీఓ లు, తహసీల్దార్ లతో ఏర్పాటు చేసిన సమావేశం లో జిల్లా పాలనాధికారి మాట్లాడుతూ ప్రభుత్వ భూముల్లో, లావుని పట్టాలలో,వక్ఫ్,ఇనాం, ఎండోమెంట్ భూములలో లే అవుట్ లు చేస్తే సహించేది లేదన్నారు.అటువంటివాటిని తక్షణమే తొలగించాలని అధికారులను ఆదేశించారు. లే అవుట్ చేయాలనుకుంటే కేవలం పట్టాభూమి లోనే అన్ని విధాలుగా అనుమతి పొంది ఉండాలని, ముఖ్యంగా డిటిసిపి అనుమతి ఉన్నవాటికి మాత్రమే గుర్తింపు ఉంటుందని స్పష్టం చేశారు.అయితే అలా అనుమతి పొందికూడా ఓపెన్ స్పేస్ నిబంధనలు పాటించనివాటిపై చర్య తీసుకుంటామని స్పష్టం చేశారు.అదే విధంగా జిల్లా లోని కొన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ భూముల్లో చేసిన కొన్ని అక్రమ నిర్మాణాలపై వెంటనే చర్యలు చేపట్టాలని సంబంధిత తహశీల్దార్ లను ఆదేశించారు.
అలసత్వం ప్రదర్శించే అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రభుత్వ భూముల ఆక్రమణ, అక్రమ లే అవుట్లు, అక్రమ నిర్మాణాల విషయంలో ఉదాసీన వైఖరిని విడనాడాలని, నిబంధనలు పాటించని వారిపై చట్ట ప్రకారం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ లు హేమంత్ బోర్కడే, రాంబాబు, రెవిన్యూ డివిజన్ అధికారులు తుకారామ్, లోకేష్, తహసీల్దార్ లు, టౌన్ ప్లానింగ్ అధికారి, తదితరులు పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.

Share This Post