అఖండ భారత దేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడుసర్దార్ వల్లభాయ్ పటేల్-జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్

అఖండ భారత దేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడుసర్దార్ వల్లభాయ్ పటేల్-జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్

ఐదు వందలకు పైగా సంస్థానానలను విలీనం చేసి అఖండ భారత దేశానికి ఒక రూపాన్ని తీసుకొచ్చిన మహనీయుడు భారత రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ అని జిల్లా పంచాయతీ అధికారి తరుణ్ కుమార్ అన్నారు. అందరం కలిసి ఉంటే కలిగే ప్రయోజనాలను వివరిస్తూ సంస్థానాలను విలీనం చేయడంలో పటేల్ కీలక పాత్ర వహించారని, ఆయన జన్మదినమైన అక్టోబర్ 31 ను జాతీయ సమైక్యతా దినోత్సవంగా జరుపుకుంటున్నామని అన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ప్రజావాణి హాల్ లో జాతీయ సమైక్యతా పై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ చూపిన తెగువ ధైర్యం మూలంగా చిన్న చిన్న సంస్థానాలు దేశంలో విలీనమై అఖండ భార దేశం ఏర్పడిందని అందుకే ఆయనను ఉక్కు మనిషి అంటారన్నారు. ఇందులో హైదరాబాద్ సంస్థానం కూడా కలిసి 75 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఇటీవల రాష్ట్రంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను జరుపుకున్నామని గుర్తు చేశారు. ఈ సందర్భంగా దేశ ఐక్యమత్యం, సమగ్రత, భద్రతను కాపాడడానికి అంకిత మవుతామని సత్యనిష్ఠతో దేశ ఏకీకరణకు, దేశాభివృద్ధికి స్వీయ తోడ్పాటు నందిస్తామని అధికారులు, ఉద్యోగులచేత ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనివాస్, జిల్లా సైన్స్ అధికారి రాజి రెడ్డి, జిల్లా పశు వైద్యాధికారి విజయ శేఖర్ రెడ్డి, జిల్లా మైనారిటీ అధికారి జెంలా నాయక్, జిల్లా సంక్షేమాధికారి బ్రహ్మాజీ, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి విజయనిర్మల, నీటిపారుదల ఈఈ శ్రీనివాస్ రావు, కలెక్టరేట్ ఏ.ఓ. యూనుస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

Share This Post